పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మంది విద్యార్థులు ప్రపంచస్థాయి విశ్వవిద్యాయాలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000 ప్లస్ ఎడెక్స్ ఆన్‌లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని సర్టిఫికెట్లు పొందే అవకాశం లభిస్తుంది