YouTube channel subscription banner header

జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీకి భారీగా పెట్టుబ‌డులు

Published on

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లివచ్చాయి. ముకేష్‌ అంబానీ రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆదానీ గ్రూప్‌ రూ.63,664 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. జీఎస్‌డీపీలో పరిశ్రమల వాటా గణనీయంగా పెరుగుతోంది. రూ.1.59 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలో ఏపీ ఆరో స్థానానికి ఎగబాకింది. వరుసగా మూడేళ్ల పాటు సులభతర వాణిజ్య ర్యాంకుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన లీడ్‌ ఇండెక్స్‌ `2023లో రాష్ట్రం టాప్‌ అచీవర్‌గా నిలిచింది. 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్‌ అండ్‌ మెగా యూనిట్లు ప్రారంభ‌మయ్యాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా అంబానీ, ఆదానీ, మిట్టల్‌, టాటా, బిర్లా, జీఎంఆర్‌, సంఫ్వీు, భజాంకా, భంగర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు తాము రాష్ట్రంలో అధిక పెట్టుబడులు పెడుతున్నామని అంబానీ, ఆదానీ స్వయంగా ప్రకటించారు.

సీఎం జగన్‌ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభించిన కొన్ని ముఖ్యమైన యూనిట్లు…

  • క్లాసిక్‌ సోడా రంగంలో రూ.861 కోట్ల పెట్టుబడితో గ్రాసిం ఇండస్ట్రీస్‌ స్థాపన జరిగింది. ఇందులో 1,300 మందికి ఉపాధి లభించింది.
  • టీవీ డిస్‌ప్లే ప్యానల్స్‌ రంగంలో రూ.1,230 కోట్లతో ప్యానల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీస్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. దీనవల్ల 2,200 మందికి ఉపాధి లభించింది.
  • ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌ రంగంలో రూ.1,050 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌లింక్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ కంపెనీ ప్రారంభమైంది. దాదాపు 2 వేల మందికి ఉపాధి లభించింది.
  • కెమెరా మాడ్యూల్స్‌ రంగంలో రూ.280 కోట్ల పెట్టుబడితో సన్నీ ఒప్పో టెక్‌ కంపెనీ ప్రారంభమైంది. దాదాపు 1,200 మందికి ఉపాధి లభించింది.
  • హాఫ్‌ హైవే టైర్స్‌ రంగంలో రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏటీసీ టైర్స్‌ కంపెనీ ఏర్పడింది. దాదాపు 840 మందికి ఉపాధి లభించింది.
  • సిమెంట్‌ రంగంలో రూ.1,790 కోట్ల పెట్టుబడితో రాంకో సిమెంట్స్‌ ప్రారంభమైంది. దాదాపు 1000 మందికి ఉపాధి లభించింది.
  • సీసీ కెమెరాల రంగంలో రూ.127 కోట్ల పెట్టుబడితో డిక్సన్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందులో 1800 మందికి ఉపాధి లభించింది.
  • లామినేషన్స్‌ రంగంలో రూ.800 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌లామ్‌ సౌత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. 1,050 మంది ఉపాధి పొందారు.
  • ఐటీ డెవలప్‌మెంట్‌ రంగంలో రూ.35 కోట్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభమైంది. దాదాపు 1000 మందికి ఉపాధి లభించింది.
  • ఫార్మారంగంలో రూ.500 కోట్ల పెట్టుబడితో యూజియా స్టెరిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉత్పత్తిని ప్రారంభించిది. దాదాపు 750 మంది ఉపాధి పొందారు.
  • బల్క్‌ డ్రగ్‌ రంగంలో రూ.191 కోట్ల పెట్టుబడితో లారస్‌ సింథసిస్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో దాదాపు 300 మంది ఉపాధి పొందారు.
  • బల్క్‌ డ్రగ్‌ రంగంలోనే రూ.440 కోట్ల పెట్టుబడితో లారస్‌ ల్యాబ్ ఉత్పత్తిని ప్రారంభించింది. దాదాపు 500 మందికి ఉపాధి లభించింది.
  • ఫ్లైవుడ్‌ రంగంలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో సెంచురీ ఫ్యానల్స్‌ ఉత్పత్తిని ప్రారంభింది. 2,266 మందికి ఉపాధి లభించింది.

సిఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేసిన పరిశ్రమలు

  • పాదరక్షల ఉపకరణాల రంగంలో రూ.70 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్‌ సెజ్‌… 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
  • ఫ్లైవుడ్‌ ప్యానల్స్‌ రంగంలో రూ.1,600 కోట్లతో సెంచురీ ప్యానల్స్‌… దాదాపు 2 వేల మంది ఉపాధి పొందుతారు.
  • గార్మెంట్స్‌ రంగంలో రూ.110.38 కోట్లతో ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ … 2,112 మందికి ఉపాధి లభిస్తుంది.
  • పాదరక్షల రంగంలో రూ.700 కోట్ల పెట్టుబడితో హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌… 10,000 మంది ఉపాధి పొందుతారు.
  • టెలివిజన్స్‌ రంగంలో రూ.108 కోట్లతో డిక్సన్‌ టెక్నాలజీస్‌… 830 మంది ఉపాధి పొందుతారు.
  • స్మార్ట్‌ వాచీలు, ఇయర్‌ పాడ్స్‌ రంగంలో రూ.300 కోట్లతో ఫాక్స్‌లింక్‌ ఇండియా విస్తరణ… 1,200 మందికి ఉపాధి లభిస్తుంది.
  • టైర్ల తయారీ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏసీసీ టైర్స్‌ ఫేజ్‌ ` 2… 1,160 మంది ఉపాధి పొందుతారు.
  • వాటర్‌ ప్రూఫింగ్‌ ఉత్పత్తుల రంగంలో రూ.202 కోట్ల పెట్టుబడితో పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌… 280 మందికి ఉపాధి లభిస్తుంది.
  • ఆహార ఉత్పత్తుల రంగంలో రూ.186 కోట్ల పెట్టుబడితో మేఘా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌… 677 మంది ఉపాధి పొందుతారు.
  • పారిశ్రామిక వాయువుల రంగంలో రూ.145 కోట్లతో ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్‌… 70 మందికి ఉపాధి లభిస్తుంది.
  • ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో రూ.125 కోట్లతో ఆప్టిమస్‌ డ్రగ్స్‌… 185 మందికి ఉపాధి లభిస్తుంది.
  • ఇన్సులేటర్స్‌ రంగంలో రూ.108 కోట్లతో విన్‌విన్‌ స్పెష్టాల్టీ ఇన్సులేటర్స్‌… 382 మంది ఉపాధి పొందుతారు.
  • బల్క్‌ డ్రగ్స్‌ రంగంలో రూ.88 కోట్లతో స్టేరాక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌… 450 మందికి ఉపాధి లభిస్తుంది.
  • బల్క్‌ డ్రగ్స్‌ రంగంలోనే రూ.82 కోట్ల పెట్టుబడితో సినాప్టిక్స్‌ ల్యాబ్స్‌… 300 మంది ఉపాధి పొందుతారు.
  • కోక్‌ అండ్‌ కోల్‌ స్క్రీనింగ్‌ రంగంలో రూ.68 కోట్ల పెట్టుబడులతో ఇషా రిసోర్సెస్‌… 220 మందికి ఉపాధి లభిస్తుంది.
  • బయో ఇథనాల్‌ రంగంలో రూ.270 కోట్ల పెట్టుబడితో అసాగో ఇండస్ట్రీస్‌… దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుంది.
  • ఉక్కు తయారీ రంగంలో రూ.8,800 కోట్ల పెట్టుబడితో జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌… దాదాపు 2500 మందికి ఉపాధి లభిస్తుంది.
  • బయో ఇథనాల్‌ రంగంలో రూ.560 కోట్ల పెట్టుబడితో క్రిభ్‌కో బయో ఇథనాల్‌… 400 మంది ఉపాధి పొందుతారు.
  • బయో ఇథనాల్‌ రంగంలోనే రూ.540 కోట్ల పెట్టుబడితో ఎకో స్టీల్‌ ఇండియా… దాదాపు 500 మంది ఉపాధి పొందుతారు.
  • బల్క్‌ డ్రగ్‌ రంగంలో రూ.240 కోట్ల పెట్టుబడితో లారస్‌ సింథసిస్‌ ల్యాబ్‌.. 450 మందికి ఉపాధి లభిస్తుంది.
  • బల్క్‌ డ్రగ్‌ రంగంలో రూ.240 కోట్ల పెట్టుబడితో లారస్‌ ల్యాబ్‌… దాదాపు 450 మంది ఉపాధి పొందుతారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...