YouTube channel subscription banner header

నిన్న నాగార్జున, నేడు మురళీమోహన్..

Published on

హీరో అక్కినేని నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ కూల్చివేతతో బడాబాబులకు ఓ వార్నింగ్ ఇచ్చిన హైడ్రా.. మరోసారి అలాంటి సంచలనానికే శ్రీకారం చుట్టింది. ఈసారి సీనియర్ నటుడు మురళీ మోహన్ కి చెందిన నిర్మాణాలకు నోటీసులిచ్చింది. 15 రోజుల్లో ఆ నిర్మాణాలు కూల్చకపోతే హైడ్రా ఆ పని చేస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇది మరో సంచలనంగా మారింది. విచిత్రం ఏంటంటే.. హైడ్రా కూల్చివేతలపై ఇటీవలే మురళీ మోహన్ పాజిటివ్ గా స్పందించారు. హైడ్రా చర్యల్ని ఆయన సమర్థించారు. సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. ఇప్పుడు మురళీమోహన్ సంస్థకే హైడ్రా నోటీసులివ్వడం విశేషం.

N-కన్వెన్షన్ కూల్చివేత సమయంలో హైడ్రాపై చాలా విమర్శలు వినిపించాయి. నాగార్జున వైసీపీతో సన్నిహితంగా ఉన్నారని, అందుకే ఆయన్ను టార్గెట్ చేశారని, చంద్రబాబుకి గురుదక్షిణ ఇచ్చేందుకు నాగార్జున నిర్మాణాన్ని కూల్చివేశారని అన్నారు కొందరు. ఇప్పుడు నోటీసులందుకున్న మురళీమోహన్ టీడీపీ నేత. నేరుగా టీడీపీ నేత నిర్మాణాలకు నోటీసులివ్వడం సంచలనంగా మారింది. 15 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన నిర్మాణాలకు కూడా హైడ్రా నోటీసులివ్వడం ఆసక్తికరం.

మురళీ మోహన్ కు చెందిన జయభేరి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తోంది. వెంచర్లు, విల్లాల నిర్మాణాలు చేస్తోంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఈ సంస్థకు చెందిన నిర్మాణాలున్నాయి. అయితే వాటిలో కొన్ని రంగలాల్ కుంట చెరువు పరిధిలోకి వస్తాయి. ఆ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ఇప్పుడు హైడ్రా నోటీసులిచ్చింది. ఆ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. తొలగించకపోతే తామే రంగంలోకి దిగుతామని పేర్కొంది. దీనిపై ఇంకా మురళీమోహన్ స్పందించలేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...