YouTube channel subscription banner header

పేదోడి చెంతకు మెరుగైన విద్య, వైద్యం.. ఇదీ జగన్ విజన్..

Published on

ఏ ప్రభుత్వం వచ్చినా పేదలు, సామాన్యులు కోరుకునేది ఒక్కటే అదే సరైన విద్య‌, వైద్యం. కానీ దురదృష్టం ఏంటంటే.. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్లకు ఆదాయ మార్గాలు కూడా ఇవే. అందుకే ప్రభుత్వం ఏదైనా విద్య, వైద్యం కేంద్రంగానే దోపిడీకి పాల్పడేవి. నిరుపేద, సామాన్యుల నోట్లో మట్టికొట్టేవి. మనదేశంలో విద్య‌, వైద్యం ఎప్పుడో ప్రైవేట్‌పరం అయిపోయాయి. కానీ భారతదేశ చరిత్రలోనే మొదటిసారి నిరుపేద, సామాన్యుడికి విద్య‌ను, వైద్యాన్ని చేరువ చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్.

విద్యావ్యవస్థపై బాబు కంటే 33 రెట్లు అధికంగా ఖర్చు..

విద్యావ్యవస్థపై చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల 398 కోట్లు. కానీ సీఎం జగన్ ఖర్చు చేసింది అక్షరాల రూ.80 వేల 756 కోట్లు. అంటే చంద్రబాబు ఖర్చు పెట్టిన దాని కంటే ఏకంగా 33 రెట్లు సీఎం జగన్‌ అధికంగా ఖర్చు చేశారు. దీన్నిబట్టే అర్థం అవుతోంది. ఏపీపై, ఏపీ భవిష్యత్తుపై చంద్రబాబుకు ఉన్న విజన్ ఏంటి?, సీఎం జగన్‌కు ఉన్న విజన్ ఏంటి అనేది. “విద్యావ్యవస్థ పటిష్టమైతే సమాజంలో పెను మార్పులు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సంపద సృష్టించబడుతుంది. ప్రశ్నించే వ్యవస్థ ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రం, దేశం దృఢంగా మారుతుంది”. దీన్ని సీఎం జగన్‌ బలంగా నమ్మారు. అందుకే గతప్రభుత్వాలు, పాలకులకు భిన్నంగా విద్యావ్యవస్థకు బలమైన పునాది వేసి, ఏపీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు.

నాడు-నేడు కింద..
క్లాస్ రూమ్స్
టాయిలెట్లు
తాగునీరు
ఎలక్ట్రిసిటీ
ఇంటర్‌నెట్
ఇంగ్లీష్ ల్యాబ్స్
కాంపౌండ్ వాల్స్
కిచెన్ షెడ్స్
పెయింటింగ్‌
ఫ్యాన్లు
లైట్లు
గ్రీన్ బోర్డ్స్
ఫర్నీచర్

స్మార్ట్‌ స్కూల్స్ కింద..
విద్యార్థులకు 9.53 లక్షల ట్యాబ్‌లు
63 వేల స్మార్ట్‌ టీవీలు
62 వేల IFP స్క్రీన్లు

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా..
గతంలో సర్కారు బడులంటేనే జనం భయపడే పరిస్థితి మనం చూశాం. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరైన విద్య అందట్లేదని తల్లిదండ్రులు లక్షలు పోసి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చేర్పించిన సందర్భాలు చూశాం. వాళ్లు తిన్నాతినకున్నా పిల్లల భవిష్యత్ కోసమని ప్రైవేట్‌ స్కూళ్లకే పంపేవారు. కానీ జగన్‌ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘నాడు-నేడు` కార్య‌క్ర‌మంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. స్మార్ట్‌ స్కూల్స్‌ కాన్సెప్ట్‌తో విద్యార్థులకు టెక్నాలజీని మరింత చేరువ చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు సీఎం జగన్.

ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లీష్ మీడియం..
పెద్దొళ్ల పిల్లల్లాగే, పేదోడి పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలి అనే గొప్ప ఆలోచన కేవలం జగన్‌కే సాధ్యమైంది. ఇవాళ, రేపు ఇంగ్లీష్‌ భాషకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. పై తరగతులకు వెళ్లాలన్నా, విదేశాల్లో చదువుకోవాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి అయిపోయిన పరిస్థితి. తెలుగు మీడియంతో చదువు పూర్తి చేసి ఇంటర్వ్యూకు వెళ్లినా మళ్లీ అక్కడ మనల్ని ఇంగ్లీష్‌ వదలదు. ఇదంతా గమనించే సీఎం జగన్‌ పాఠశాల దశ నుంచే ఇంగ్లీషు బోధన తీసుకొచ్చారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా విషం కక్కింది. వాళ్ల పిల్లలేమో కార్పొరేట్‌ స్కూళ్లో చదవొచ్చు, విదేశాలకు వెళ్లి కోట్లు సంపాధించొచ్చు. కానీ పేదవాడి పిల్లలు మాత్రం ఎప్పుడూ అక్కడే ఉండాలనే కుటిల బుద్ధితో ఇంత గొప్ప ఆలోచనపైనా విమర్శలు చేశారు.

నాడు ఫీజుల విప్లవం – నేడు చదువుల విప్లవం..
చంద్రబాబు హయంలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. కార్పొరేట్‌ స్కూళ్లు రాజ్యమేలాయి. పేదలకు ఉచిత విద్య దూరమైంది. నారాయణ స్కూళ్లు డబుల్ అయ్యాయి. శ్రీచైతన్య స్కూళ్ల దోపిడీ పెరిగింది. వీధివీధికి ప్రైవేట్ స్కూళ్లు వెలిశాయి. పిల్లలకు నాణ్యమైన భోజనం కరువైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మరుగున పడింది.

కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కు ధీటుగా..
నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌కు ధీటుగా తీర్చిదిద్దారు సీఎం జగన్. 16 వేల 484 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 11,888 ఆస్పత్రులను ఆధునీకరించారు. వైద్య వ్యవస్థలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి, ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేశారు. విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటింటికీ వైద్య సేవలు అందించారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మించి చరిత్ర సృష్టించారు. వార్షిక ఆదాయం 5 లక్షల్లో ఉన్న‌ ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో 95 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.

వైద్య వ్యవస్థలో జగన్ సంస్కరణలు..
ఉద్యోగాల భర్తీ – 53,000
విలేజ్ క్లినిక్స్‌ – 10,032
అర్బన్ క్లినిక్స్- 542
అంబులెన్స్‌లు-768
ఫ్యామిలీ డాక్టర్
ఆరోగ్య సురక్ష
జీరో వేకెన్సీ పాలసీ

జగన్‌కు, చంద్రబాబుకు తేడా ఇదే..
చంద్రబాబు పాలనలో 55 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే.. సీఎం జగన్‌ వచ్చాక వాటిని కోటి 42 లక్షలకు పెంచారు. బాబు పాలనలో ఆరోగ్యశ్రీ కార్డుపై రెండున్నర లక్షల పరిమితి ఉంటే జగన్ దాన్ని 25 లక్షలకు పెంచారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ కింద 3 లక్షల 74 వేల మందికి వైద్యం అందితే… జగన్ పాలనలో ఏకంగా 41 లక్షల 40 వేల మంది పేదలు వైద్యం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు రూ.5 వేల 456 కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ 13 వేల 168 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...