వైసీపీ అభ్యర్థులుగా పార్లమెంట్, అసెంబ్లీలకు జగన్ ఎంపిక చేసిన కొందరిది సాధారణ నేపథ్యమే. నెల్లూరు అర్బన్ అభ్యర్థిగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. మైలవరం అభ్యర్థిగా సాధారణ రైతు, పార్టీ కార్యకర్త సర్నాల తిరుపతిరావును ఎంపిక చేశారు. మడకశిర నియోజకవర్గంలో ఉపాధిహామీ కూలీ, పార్టీ కార్యకర్త ఈర లక్కప్పను జగన్ ఎంపిక చేశారు