YouTube channel subscription banner header

జాబులివ్వడంలో జగన్ దరిదాపుల్లో కూడా లేని బాబు

Published on

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బలంగా వినిపించిన నినాదం “జాబు కావాలంటే బాబు రావాలి.” అనుకున్నట్టుగానే బాబు వచ్చారు, మరి ఏం చేశారు..? బాబు హయాంలో(2014-2019) ప్రభుత్వ రంగంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,780. ఉద్యోగాలే లేవు అని ఎల్లో మీడియా కోడై కూస్తున్న జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలెన్నో తెలుసా..? అక్షరాలా 2,36,506. అంటే చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలకంటే దాదాపు ఏడింతలు ఎక్కువగా జగన్ ఇవ్వగలిగారు. మరిక్కడ జాబు అంటే మొదటగా గుర్తు రావాల్సిన పేరు జగన్ కానీ బాబు కాదు. జగన్ వచ్చారు, జాబు వచ్చింది. అని ఇకపై నినాదాన్ని మార్చుకోవాలి.

బాబు హయాంలో ఇలా..
చంద్రబాబు హయాంలో గ్రూప్-1 ఉద్యోగాలు 247, గ్రూప్-2 ఉద్యోగాలు 1428, డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్ట్‌లు 17,500. పోలీస్ శాఖలో 7,721 ఇతర శాఖల్లో 7,884 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.

జగన్ హయాంలో..
గ్రూప్-1 ఉద్యోగాలు 110
గ్రూప్-2 ఉద్యోగాలు 897
నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137
విద్యాశాఖలో 22,297
డీఎస్సీ-1998 వారికి 5,534
డీఎస్సీ-2008 వారికి 2193
డీఎస్సీ-2024 ద్వారా 6100
జీఏడీ 3784
స్పెషల్ డీఎస్సీ, ఇతర ఉద్యోగాలు 1802
పోలీస్ శాఖ 6511
మెడికల్ ఆఫీసర్స్ 1247
హోమియోపతి ఆఫీసర్స్ 53
స్టాఫ్ నర్స్ 60,450
ఇతర డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు 387
సచివాలయ ఉద్యోగాలు 1,26,000

ఇవన్నీ కలిపితే సీఎం జగన్ హయాంలో మొత్తం 2,36,506 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప..? బాబొస్తే జాబొస్తుందంటూ ఊదరగొట్టి నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి యువత ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు గొప్పవాడా..? అధికారంలోకి వచ్చి వెంటనే సచివాలయాలు పెట్టి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసి, డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చారు.

జగన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం వలంటీర్ పోస్టులంటూ వెటకారం చేస్తున్న ఎల్లో మీడియా ఈ గణాంకాలకు ఏమని బదులిస్తుంది. వలంటీర్ పోస్ట్ లను పక్కనపెడితేనే చంద్రబాబుకి అందనంత దూరంలో ఉన్నారు జగన్. వలంటీర్ పోస్ట్ లు, ఆర్టీసీ విలీన ఉద్యోగాలు, రెగ్యులరైజ్ చేసిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలుపుకుంటే మొత్తం ఉద్యోగాల సంఖ్య 5 లక్షలు దాటుతుంది. ఇప్పటికీ ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తాను అని చెబుతున్న చంద్రబాబు 2014-2019 మధ్య కాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారనే విషయాన్ని మాట మాత్రంగా అయినా ప్రస్తావిస్తున్నారా..? అక్కడే ఉంది మతలబు. బాబు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు కాబట్టే విష ప్రచారం మొదలైంది. గణాంకాల జోలికి పోకుండా కేవలం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...