రెండోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన జగన్, సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇల్లు వరదల్లో మునిగిపోయిందని అందుకే ఆయన కలెక్టరేట్ లో నిద్రపోతున్నారని, అది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా కారణం వేరే ఉందన్నారు. నిద్రపట్టకే అర్ధరాత్రి 2 గంటలకు, 3 గంటలకు చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇంట్లోకి నీరు వచ్చింది కాబట్టి తాను బయట ఉన్నానంటే పబ్లిసిటీ రాదు కాబట్టి, కలెక్టర్ కార్యాలయంలో ప్రజల కోసమే అందుబాటులో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారని సెటైర్లు పేల్చారు జగన్. ఆ బిల్డప్ ఇచ్చే వ్యవహారంలో కూడా సిన్సియారిటీ లేదన్నారు. విజయవాడలో ఏ కాలనీలోనూ పరిస్థితులు బాలేవన్నారు, ఎక్కడా రిలీఫ్ క్యాంప్ లు లేవన్నారు జగన్.
https://x.com/YSRCPBrigade/status/1831282507502989621
పాలన అలా కాదు..
“వారంరోజులు మీకు టైమ్ ఇస్తున్నా, వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తా, నేను వచ్చేసరికి ఏ ఒక్కరూ ఫలానా నష్టం జరిగింది, ఫలానా కలెక్టర్ మాకు పలకలేదు అనే మాట రాకూడదు” ఇలా కలెక్టర్లకు సీరియస్ గా చెబితే పరిస్థితులు చక్కబడేవని, కానీ చంద్రబాబు అలా చేయలేదని, పబ్లిసిటీకోసమే ప్రయత్నించారని అన్నారు జగన్. వైసీపీ హయాంలో రూ.500కోట్లు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ కట్టామని, దాని వల్ల కృష్ణలంక నీట మునగలేదని, వారంతా సంతోషంగా ఉన్నారని, తనని థ్యాంక్స్ చెప్పేందుకు స్థానికులు బయటకు వచ్చి తన కారు ఆపారని చెప్పారు. 3 లక్షలమంది ఆ గోడవల్ల రక్షణ పొందారని చెప్పారు జగన్.
https://x.com/YSRCPBrigade/status/1831283536386818275
బుడమేరు గేట్లు..
బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల వరద వచ్చి విజయవాడ మునిగిందంటూ జగన్ తన తొలి పరామర్శలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అసలు బుడమేరుకు గేట్లు ఉండవని, ఆ విషయం కూడా జగన్ కి తెలియదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఈరోజు పరామర్శలో ఆ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు జగన్. బుడమేరులో పోలవరం కెనాల్ కలుస్తుందని, వాటినుంచి వచ్చిన నీరు ప్రకాశం బ్యారేజ్ లో చేరి సముద్రంలోకి వెళ్తుందని అన్నారు. గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని, సీఎం ఇంటిని కాపాడుకోడానికే గేట్లు ఎత్తి విజయవాడను ముంచారని అన్నారు జగన్. వరదల్లో జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.