YouTube channel subscription banner header

జగన్ పాలనలో చంద్రబాబు ఊహకు కూడా అందని భూ పంపిణీ

Published on

ఎవరి ఊహకు కూడా అందని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో భూముల సమస్యలకు పరిష్కారం చూపించారు. భూ సమస్యల పరిష్కారానికి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న‌ చుక్కల భూములు, లంక భూములు, సర్వీస్ ఇనాం భూములు, షరతుల పట్టా భూములకు వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారు. అందుకు ఆయన చేపట్టిన భూసంస్కరణలు కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయి.

ప్రతి పేదవాడికి భూమి ఉండాలని, ప్రతి ఒక్కరూ తలెత్తుకుని వ్యవ‌సాయం చేయాలని జగన్ కలలు కన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ.. ఏ ముఖ్యమంత్రి కూడా పంచి పెట్టని విధంగా వైఎస్ జగన్ భూములను పంచిపెట్టారు. అసైన్డ్ భూములు మొదలు 10 రకాల భూములను ఆయన పేదలకు పంచిపెట్టారు.

ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 42.6 లక్షల ఎకరాల భూమిని రీసర్వే చేయించారు. 45 వేలకు పైగా కేసులను పరిష్కరించారు. అత్యాధునిక యంత్రాలతో భూములను కొలిపించి అక్కడికక్కడే భూ సమస్యలను పరిష్కరించారు. అర్హులకు భూములు ఇవ్వడంతో పాటు రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతుల బీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలను అమలు చేశారు.

భూ సమస్యల పరిష్కారం కోసం భూరక్ష పథకం ద్వారా చేసిన పనులు ఇవీ..

సిబ్బంది..
గ్రామ సర్వేయర్లు: 10,185
వీర్వోలు: 2,688
పంచాయతీ కార్యదర్శులు: 5,417
ప్లానింగ్ కార్యదర్శులు: 3,788
మొబైల్ మెజిస్ట్రేట్ల సేవలు: 679
భూముల రీసర్వే (లక్షల ఎకరాల్లో): 42.6
మ్యుటేషన్లు (లక్షల ఎకరాల్లో): 4.8
కేసుల పరిష్కారం: 45 వేలు
భూహక్కు పత్రాల పంపిణీ (లక్షల్లో): 17.53

జగన్ పంపిణీ చేసిన భూముల వివరాలు..

అసైన్డ్ భూములు
రైతులు: 42,307 మంది
విస్తీర్ణం: 46,463.82 ఎకరాలు
విధానం: డికెటీ ప్లస్ ఎఫ్ఎంబీ ప్లస్ అడంగల్

లంక భూములు
రైతులు: 17,768 మంది
విస్తీర్ణం : 9,064
విధానం : డీకెటీ ప్లస్ సీ కెటగిరీ లీజు

సర్వీస్ ఇనాం భూములు
రైతులు: 1,61,584 మంది
విస్తీర్ణం: 1,58,113 ఎకరాలు
విధానం: నిషేధిత జాబితా నుంచి తొలగింపు

చుక్కల భూములు
జిల్లాలు: 15
విస్తీర్ణం: 2.06 లక్షల ఎకరాలు
రైతులు: 1.85 లక్షల మంది

పోడు భూముల పంపిణీ
రైతులు: 1,30,368 మంది
విస్తీర్ణం: 2,87,710 ఎకరాలు
విధానం: ఆర్వోఎఫ్ఆర్

షరతుల పట్టా భూములు
రైతులు: 24,541 మంది
విస్తీర్ణం: 33,000 ఎకరాలు

భూమి కొనుగోలు పథకం
రైతులు: 22,346 మంది
విస్తీర్ణం: 22,837 ఎకరాలు

అాసైన్డ్ భూములకు యాజమాన్యం పట్టాలు
రైతులు: 27,41,698 మంది
విస్తీర్ణం: 15,21,160 ఎకరాలు

శ్మశానవాటికలకు భూములు
గ్రామాలు: 1,563
విస్తీర్ణం: 951 ఎకరాలు

గిరిజనులకు డీకేటీ పట్టాలు
రైతులు: 26,287 మంది
విస్తీర్ణం: 39,272 ఎకరాలు

పునర్విచారణలో పట్టాలు
రైతులు: 25,389 మంది
విస్తీర్ణం: 40,930 ఎకరాలు

పోలవరం ముంపు రైతులు
రైతులు: 2,372 మంది
విస్తీర్ణం: 6,407 ఎకరాలు

చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అసైన్డ్ భూములు, పోడు భూముల పంపిణీ జరగలేదు. అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కారించ‌లేదు. లంక భూముల భూముల పంపిణీ జరగలేదు. చుక్కల భూముల సమస్యను ప‌ట్టించుకోలేదు. డీకేటి భూములకు పట్టాలు ఇవ్వలేదు. ఎవరికీ భూ హక్కులు కల్పించలేదు. భూ సర్వే అసలే లేదు. సర్వీస్ ఇనాం భూములను, షరతుల పట్టా భూములను పట్టించుకోలేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...