నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఆ పిల్లలకు నాణ్యమైన విద్య అందించినప్పుడే దేశం గర్వించే ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు భారతాన్ని నిర్మించగలుగుతారు. కేవలం మాటలు చెప్పడం కాదు.. ఈ విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. పేదింటి బిడ్డలు చదువుకునే స్కూళ్లను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.