గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. చెప్పింది చేయడం ఆయన నిజాయితీ. అలవికాని హామీలు ఇచ్చి చేతులెత్తేయడం ఆయనకు చేతకాని విద్య. అందుకే ఆయన ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనేఫెస్టోలో కొత్త అంశాలు చేర్చకపోవడం అందుకే. ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు చేపట్టాలంటే వనరులు కావాలని ఆయన మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను మదిలో ఉంచుకుని ప్రస్తుతం హామీలు ఇస్తున్నట్లు తెలిపారు.