YouTube channel subscription banner header

టీడీపీ పొత్తు.. సీనియర్ల గుండెల్లో గుబులు..!

Published on

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయన ప్రయత్నాలు మాత్రం పార్టీలో సీనియర్ నేతల సీట్లకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే… వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకి లేదనే చెప్పాలి. అందుకోసం జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. నిజానికి జనసేనతో పొత్తు అంటేనే చాలా మందికి ఇష్టం లేదు. ఆ పార్టీకి పెద్దగా లీడర్స్ లేరు.. గత ఎన్నికల్లో 5.6 శాతం మాత్రమే సీట్లు వచ్చాయి. అలాంటి పార్టీతో పొత్తేంటి అని అయిష్టత ప్రదర్శిస్తున్నారు. అందులో 25 సీట్లు ఇవ్వడంతో.. తమ టికెట్లకే ఎసరు పడిందని తెగ ఫీలవుతున్నారు. కానీ.. ఈ విషయంలో చంద్రబాబుని ఎదురించలేక సర్లే అని వదిలేశారు.

కానీ, ఇప్పుడు లైన్‌లోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని ఆ పార్టీ నేతలు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పొత్తులు తప్పటంలేదు అని చెప్పారట. పార్టీ కోసం కొందరు సీనియర్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పారట. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అన్నారే కాని ఎంతమందో మాత్రం చెప్పలేదు. అయితే ఇదే విషయమై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అంటే చాలామంది సీనియర్లు రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పల్లకీలను మోయాల్సిందే అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం దేవినేని ఉమ, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ రావు, బుద్ధా వెంకన్న, బోడె ప్రసాద్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొడ్డు వెంకటరమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, బండారు మాధవనాయుడు, పీవీఎస్ వర్మ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఆనం రామనాయారణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెలగపూడి రామకృష్ణతో పాటు రాయలసీమలో మరికొందరు సీనియర్లున్నట్లు సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం తక్కువలో తక్కువ 40 మంది సీనియర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావటంలేదు.

తాజా డెవలప్‌మెంట్‌ ప్రకారం పోటీ అవకాశాన్ని కోల్పోతున్న నేతలను చంద్రబాబు మెంటల్‌గా ప్రిపేర్ చేస్తున్నారట. వాళ్లకు టికెట్లు కేటాయించకపోయినా.. పార్టీకి సపోర్ట్‌గా ఉండాలని ఆయన చెబుతున్నారట. మరి.. టికెట్ రాకపోయినా అదే పార్టీలో కొనసాగడాన్ని అందరు నేతలు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...