YouTube channel subscription banner header

రాయలసీమలో జనసేన చేతులెత్తేసిందా?

Published on

రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో ఉన్న జనసేన 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీట్లలో కూడా ఎక్కువ భాగం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపైనే దృష్టి పెట్టింది. ఏ జిల్లాలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏవన్న విషయమై చంద్రబాబునాయుడుతో పవన్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఉభయగోదావరి జిల్లాలోనే 11 స్థానాలున్నాయి. విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కోటి చొప్పున‌ పోటీ చేయబోతోంది.

ఈ మొత్తంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో జనసేన అసలు పోటీ చేయటంలేదు. అలాగే కడపలోని రైల్వేకోడూరు, తిరుపతి, అనంతపురంలో మాత్రమే జనసేన పోటీ చేయబోతోంది. అంటే మొత్తం మీద రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్నది మూడంటే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే. రాయలసీమలో బలిజల జనాభా సుమారు 35 శాతం ఉంటుంది. చాలా నియోజకవర్గాల్లో బలిజలే గెలుపోటములను నిర్ణయిస్తారు. సామాజికవర్గాల పరంగా గోదావరి జిల్లాల్లో కాపులన్నా, రాయలసీమలో బలిజలన్నా ఒకటే.

మరి ఇంతబలమైన ప్రభావం చూపగలిగిన స్థితిలో బలిజలున్నా పవన్ మూడు స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారో అర్థంకావటంలేదు. ఇంత తక్కువ సీట్లలో పోటీ చేయబోతున్న కారణంగా జనసేన ఓట్లు లేదా బలిజల ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాపులు / బలిజలు లేదా జనసేన ఓట్లు టీడీపీకి సజావుగా బదిలీ కావాలంటే జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చాలాకాలంగా కాపు కురు వృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య పదేపదే చెబుతున్నారు.

తక్కువ సీట్లు తీసుకుంటే తమ సామాజికవర్గం ఓట్లు టీడీపీకి బదిలీకావని జోగయ్య స్పష్టంగానే చెప్పారు. అప్పుడు పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని, జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా జోగయ్య జోస్యం చెప్పారు. జోగయ్య ఇంత చెప్పినా పవన్ పట్టించుకోలేదు. దాని ఫలితంగా కాపులు, పార్టీలోని మద్దతుదారులే పవన్‌పైన మండిపోతున్నారు. 24 సీట్లలో పోటీ చేయటానికి జనసేనకు టీడీపీతో పొత్తు అవసరమా అని పవన్‌ను నిలదీస్తున్నారు. దాన్నే పవన్ తట్టుకోలేకపోతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...