YouTube channel subscription banner header

బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌.. హైకోర్టు కీలక తీర్పు!

Published on

బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటీష‌న్ల‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ఆఫీసును ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తామని పేర్కొంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీలు పిటీషన్లు దాఖలు చేశాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.

ఇప్పటికే 10 మందికిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కప్పుకోగా.. మరికొంత మంది‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ తీర్పు బీఆర్ఎస్‌కు ఊరటనిచ్చినట్లయింది. కోర్టు తీర్పుతో తాత్కాలికంగా ఫిరాయింపులకు చెక్ పెట్టిట్లయింది. ఐతే హైకోర్టు తీర్పుతో స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...