YouTube channel subscription banner header

చీప్ పబ్లిసిటీ కోసం పేద‌ల ఆత్మ‌గౌర‌వం రోడ్డు పాలు.. బాబుపై కొడాలి నాని ఫైర్

Published on

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీ అధినేతలు, కార్యకర్తలు ఒకరిపై మరొకరి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఏప్రిల్ ఒకటో తారీకు పెన్షన్ రావాల్సి ఉండగా ఆలస్యంగా పెన్షన్ రావడంతో చంద్రబాబు కారణంగానే పెన్షన్ ఆలస్యం అవుతుందంటూ వైసీపీ అధినేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్‌కి చంద్రబాబు ఫిర్యాదు చేయించారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

చంద్ర‌బాబు తన చేతికి మట్టి అంటుకోకుండా అన్ని పనులు చేస్తూ ఉంటారు, ఇలాంటి వాటిలోనే ఈ పెన్షన్లు అడ్డుకోవడం ఒకటని కూడా చెప్పాలి. వలంటీర్ల ద్వారా పెన్షన్ అందజేస్తే వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి లేఖ రాయించి, పెన్షన్లు వలంటీర్లు అందించకుండా అడ్డుకున్నారు. ఇలా ఒకటో తారీకు పెన్షన్లు రాకపోవడంతో ఎంతో మంది వృద్ధులు పెన్షన్ కోసం మండుటెండ‌లో సచివాలయాలకు బయలుదేరారు.

ఇలా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన చీప్ పబ్లిసిటీ కోసం పేదల ఆత్మగౌరవాన్ని రోడ్డుపాలు చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి క్యూ లైన్ లలో నిలబడి పెన్షన్ తీసుకునే పద్ధతిని ఎప్పుడో మర్చిపోయారని, ఎంతో గౌరవంగా ఇంటి వద్దకే పింఛ‌న్‌ ఇవ్వడం హక్కుగా చేసుకున్నారని తెలిపారు.

ప్రస్తుతం మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారులను తన వైపుకు తిప్పుకొని వలంటీర్ల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు అందకపోవడంతో పేద ప్రజల ఆత్మాభిమానం రోడ్డు పాల అయిందని, పెన్షన్ కోసం మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ప్రజలు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...