జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో చుక్కెదురవుతోంది. పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను అడ్డుకునేందుకు స్థానికతను ముందు పెడుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయడానికి వర్మ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయన కొంత కాలంగా స్థానికత నినాదాన్ని అందుకున్నారు.
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో కూడా ఇదే ఎత్తుగడతో ప్రత్యర్థులు ఆయన ఓటమికి కారణమయ్యారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. ఈ సారి పవన్ కల్యాణ్ కాకినాడ లోక్‌సభ స్థానానికే కాకుండా పిఠాపురం శాసనసభ నియోజకవర్గానికి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్మ స్థానికత నినాదాన్ని అందుకున్నారని భావిస్తున్నారు.