జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సమయం, సందర్భం తెలియదు. ఎప్పుడూ ఎవరినో ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎన్టీఆర్ సంస్కారం గురించి మాట్లాడుతూ కృష్ణపై నోరు పారేసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కావాలనుకుంటే ఆయన కృష్ణను చులకన చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగితం కూడా ఆయనకు లేదు. కృష్ణ విభేదించినప్పటికీ ఎన్టీఆర్ ఏమీ అనలేదని, అది ఎన్టీఆర్ సంస్కారమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలు నచ్చక కృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.
ఎన్టీఆర్ సినిమాలకు పోటీగా కృష్ణ సినిమాలు తీశారు. అంత మాత్రాన కృష్ణ తప్పు చేసినట్లు ఎలా అవుతుందో పవన్‌కే తెలియాలి. విభేదాలు ఉన్నప్పటికీ ఇరువురు కూడా సంస్కారాన్నే పాటించారు. ఎన్టీఆర్ సంస్కారం పాటించి కృష్ణ పాటించకపోవగం ఏమీ లేదు. అయితే, తోలు వలుస్తా, తాట తీస్తా లాంటి బజారు రౌడీ మాటలు వారెవరూ మాట్లాడలేదు. మరో విషయం… కృష్ణను ఎన్టీఆర్ ఏం చేయాల్సి ఉండిందనేది కూడా పవన్ కల్యాణ్ చెప్తే బాగుండేది. పవన్ కల్యాణ్‌ను వ్యతిరేకిస్తే ఆయన అభిమానులు ఉచితానుచితాలు మరిచిపోయి దాడులు చేస్తుంటారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సూపర్ స్టార్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. కృష్ణ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు పవన్ కల్యాణ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు టీడీపీ వాళ్లకు చెంచాగిరి చేయాలని ఉంటే చేసుకో… మా సూపర్ స్టార్ జోలికి ఎందుకు వస్తావు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మీద మండిపడుతున్నారు. ‘నీ రాజకీయ ప్రయోజనం కోసం మా సూపర్ స్టార్‌ను ఎందుకు మీ రొచ్చులోకి లాగుతావు.. నీ చిల్లర వేషాలకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తావు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవానికి, మహేష్ బాబు రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. తన సినిమాలు, తన వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి హీరో అభిమానులను ఓట్ల కోసం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టడం రాజకీయ పరిణతి ఎలా అవుతుంది? నిజానికి, సంస్కారం లేనిది పవన్‌కు మాత్రమే. కృష్ణను ఎన్టీఆర్ ఏమీ అనకపోవడమే సంస్కారమైతే, ఆ సంస్కారం పవన్ కల్యాణ్ కు ఉందా? లేదనే విషయం ఆయన వ్యాఖ్యలను బట్టే అర్థమవుతుంది.