YouTube channel subscription banner header

పల్లకి మోయడానికి తప్ప దేనికి పనికిరావని తేల్చేశారు..! పవన్‌పై అంబటి ఫైర్

Published on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పల్లకి మోయడానికి తప్ప దేనికి పనికిరారని టీడీపీ తేల్చేసిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇవాళ టీడీపీ – జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా పొత్తులో భాగంగా జనసేనకు 175 స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే మూడు లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.

అయితే జనసేన 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 24 స్థానాలకు సరిపెట్టుకోవడంపై కాపు నాయకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు, కనీసం నాలుగు లోక్ సభ స్థానాలు దక్కితేనే గౌరవం ఉంటుందని, ఓట్ల బదిలీ కూడా జరుగుతుందని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యతో పాటు పలువురు కాపు నాయకులు గతంలో అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

బయట ప్రచారం జరుగుతున్నట్లు 20, 25 స్థానాలకే జనసేన పరిమితం కాదని.. మొత్తం సీట్లలో మూడో వంతు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అయితే ఎల్లో మీడియా మొదటి నుంచి ప్రచారం చేస్తున్నట్లుగానే చంద్రబాబు జనసేనకు కేవలం 24 స్థానాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జనసేన 175 సీట్లకు గాను 24 స్థానాలకే పరిమితం కావడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపు సంఘాల నాయకులు కూడా చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ టీడీపీ పల్లకి మోయడానికే జనసేన పార్టీ పెట్టాడని మొదటి నుంచి విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఇప్పుడు అదే నిజమైందని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ 24 స్థానాలకు సరిపెట్టుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పల్లకి మోయడానికి మాత్రమే పనికొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికి రావని తేల్చేసారు.. ఛీ’ అంటూ పవన్ ను ఉద్దేశించి అంబటి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ 24 సీట్లకే సరిపెట్టుకున్న నేపథ్యంలో ఇరు పార్టీల ఓట్లు బదిలీ అవుతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...