రాయచోటి అంటేనే శ్రీకాంత్ రెడ్డి. అవును రాయచోటి అని చెబితే మొదటిగా గుర్తొచ్చేపేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని తన పనితనంతో శ్రీకాంత్ రెడ్డి అడ్డాగా మార్చేశారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, వరుసగా, నాలుగు సార్లు గెలుచి తన సత్తా చాటారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్న శ్రీకాంత్ రెడ్డిని అయిదోసారి కూడా గెలిపించేందుకు రాయచోటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
అభివృద్దికి మారు పేరే శ్రీకాంత్ రెడ్డి
2019లో తొలిసారి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి జగన్ వెన్నంటే ఉండి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి నుండి వరుసగా 2014 ,2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తూ,అన్ని వర్గాలతోనూ ముఖ్యంగా నియోజక వర్గంలో అధిక సంఖ్యాకులైన బలిజ సామాజిక వర్గానికి సైతం శ్రీకాంత్ రెడ్డి మా బిడ్డే అనేంతగా ఆప్యాయంగా ఉంటూ అందరివాడుగా కలిసిపోతూ, ఎమ్మెల్యే అంటే శ్రీకాంత్ రెడ్డే, రెండో వ్యక్తికి మా హృదయాల్లో స్థానం లేదు అనేలా నిలిచిపోయారు.
రాయచోటి అభివృద్దే లక్ష్యంగా..
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి సమస్య ఎక్కడుంటే శ్రీకాంత్ రెడ్డి అక్కడ ఉంటూ, ప్రజల్లో కలిసిపోతూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సహకారంతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకూ ప్రత్యేక నిధులు తీసుకురావడమే కాకుండా, రాయచోటిని ప్రత్యేక జిల్లా చేయడం ద్వారా మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, దీనికి తోడు యువకుడిగా ఉన్నప్పటి నుండే తన తండ్రి గడికోట రామసుబ్బారెడ్డితో పాటు ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అందిరినీ ఆప్యాయంగా ఇంట్లో మనిషిలా పులకరిస్తూ కలిసిపోతుంటాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా అదే ఆప్యాయతతో కలియతిరుగుతూ, అన్ని వర్గాలకూ చేదోడు వాదోడుగా అండగా ఉండటంతో ప్రజలు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మీద బాగా పట్టుండటం, ఏ విషయం మీదైనా అవలీలగా మాట్లాడటం, నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడంలో, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.100 కోట్లతో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వంటి పనులతో శ్రీకాంత్ రెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాయలసీమలో పులివెందుల తరువాత రాయచోటి జగన్‌కు కంచుకోట. అంతేకాకుండా కొత్త జిల్లా కూడా అవ్వడంతో అభివృద్దిలో దూసుకుపోతుంది. శ్రీకాంత్ రెడ్డిని ఓడిస్తే నియోజకవర్గంలో అభివృద్ది ఆగిపోతుందని, ఎట్టి పరిస్దితుల్లోనూ అలా జరగనివ్వమని, భారీ మెజార్టీతో గెలిపించుకుని తమ సత్తా చూపెడతామని ధీమాగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలు.
టీడీపీకి చుక్కలు చూపిస్తున్న శ్రీకాంత్ రెడ్డి..
రాయచోటి అంటేనే శ్రీకాంత్ రెడ్డి అని రెండో వ్యక్తిని ఎమ్మెల్యేగా ఉహించుకోలేమని టీడీపీ నేతలకు ముఖం మీదే చెబుతున్నారు జనాలు. ఇటీవల నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన సభకు ఇంటింటికీ తిరిగి అయ్యా, బాబూ అంటూ బతిమాలితే గానీ సభకు జనాలను రాని పరిస్థితి. దీనికి తోడు టీడీపీలో అంతర్గత విభేదాలు, ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంక గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యర్థిగా టీడీపీ నేత మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా, పార్టీ నేతలే సహకరించకపోవడంతో ఐదోసారి కూడా శ్రీకాంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని, ఆయన చేసిన అభివృద్ధే ఆయన్ని గెలిపిస్తుందని ప్రజలే చెబుతుండటం విశేషం.