టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని నారా భువనేశ్వరి ప్రకటించారు. 2018లో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 300 అన్న క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసివేసిందని ఆమె ఆరోపించారు.
అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 3 లక్షల మంది పేదలకు ఆహారం అందుబాటులోకి వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను ఇబ్బంది పెట్టిందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కానీ వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి జరిగిందని, చాలా క్యాంటీన్లు శ్మశానాల పక్కన, మురికి కాల్వల పక్కన ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వారు అంటున్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒక రాజకీయ అంశంగా మారింది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిజంగానే పేదలకు అన్న క్యాంటీన్లు అవసరమా అనేది చర్చనీయాంశమైంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అంశం రాబోయే ఎన్నికల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా పేదలకు నిజంగానే లాభం జరుగుతుందా అనేది ఓటర్లు నిర్ణయించాలి.
అయితే.. ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో భువనేశ్వరి ఇచ్చిన హామీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె ఏ హోదాలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై హామీ ఇచ్చారు అనే చర్చ మొదలైంది. టీడీపీ మ్యానిఫెస్టోలో అన్న క్యాంటీన్లకు స్థానం ఉందా? అన్న క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలనే ప్రశ్నలు వినపడుతున్నాయి. అసలు ..అన్నా క్యాంటీన్ల గురించి భువనేశ్వరి ఏ బెసిస్ మీద హామీ ఇస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.