ప్రజలకు 35 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 540 సేవలను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చారు అదే వలంటీర్ వ్యవస్థ. గతంలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా..పెన్షన్ రావాలన్నా కూడా అధికారుల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయినప్పటికీ మన పట్ల కనికరం ఉండేది కాదు, పెన్షన్ కోసం లంచం ఇచ్చి అధికారులను ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉంటేది