ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. జగన్, పవన్ కలిసి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. విజయం కోసం వీరు కలిసి నడిస్తే పర్వాలేదు.. కానీ.. ఇద్దరూ కలిసి.. ఓ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే.. కాపు సామాజిక వర్గాన్ని పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసే మోసం చేస్తున్నారు. అందుకు..కాపు కురువృద్ధనేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ.
హరిరామ జోగయ్య రీసెంట్‌గా పవన్‌కు లేఖ రాశారు. అందులోని అంశాలు చదివితే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. మొదటి నుండి జోగయ్య చెబుతునే ఉన్నారు ఎన్నికల్లో పోటీకి జనసేన కనీసం 50-60 సీట్ల మధ్య తీసుకోవాలని. ముఖ్యమంత్రి కుర్చీని పవన్ రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని కాపులు కోరుకుంటున్నట్లు హెచ్చరిస్తునే ఉన్నారు.
20-30 సీట్లు తీసుకోవద్దని మొత్తుకుంటున్నా కూడా… పవన్ దానికే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కాపు ఓట్లు వీరి కూటమికి పడే అవకాశం చాలా తక్కువగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దింపటం అంటే చంద్రబాబును కూర్చోబెట్టడంగా కాపులు భావించటంలేదని, వపన్ ముఖ్యమంత్రి అవటమే కాపుల ఆకాంక్ష అని పదే పదే మొత్తుకుంటునే ఉన్నారు. కానీ.. పవన్ కనీసం ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
పవన్ లెక్కప్రకారమే మూడోవంతు అంటే 175 సీట్లలో 58 సీట్లు. అయితే ఇంతకుముందు తాను చెప్పిన మాటను పవన్ పక్కనపెట్టి 25(28?) సీట్లకు ఒప్పేసుకున్నారు. జనసేనకు చంద్రబాబు ఎలాగూ ఎక్కువ సీట్లు ఇవ్వరని అందరూ అనుకుంటున్నదే. అయితే బేరమాడి ఎక్కువ సీట్లు సాధించాల్సిన బాధ్యత పవన్ పైనుంది. ఇక్కడే పవన్ పైన కాపు సమాజంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
జోగయ్య లేఖతో పాటు, పవన్ 28 సీట్లకు ఒప్పుకోవడం వల్ల కాపు ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి జనసేన ఓట్ల శాతంపై ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాలు రానున్న కాలంలో పవన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.