జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపుల్లో తనకున్న ఇమేజ్ ఏ పాటిదో చెప్పేశారు. కాపు సామాజికవర్గాన్ని నిర్దేశించే సత్తా తనకు లేదని పరోక్షంగా అంగీకరించారు. కాపులను తాకట్టు పెట్టారనే విమర్శలపై స్పందిస్తూ.. అంత స్థాయి తనకు లేదని తేల్చేశారు. కాపులను ప్రభావితం చేయగలిగే శక్తి ఉండి ఉంటే తన పరిస్థితి ఇలా ఎందుకు ఉండేదన్నారు. కాపులు తన వెంట ఉంటే ఈ పాటికే ప్రభుత్వాన్ని స్థాపించేవాడిని కదా అని వాపోయారు.