విజయవాడ ప్రజలు వరదల్లో మునిగిపోయి అష్టకష్టాలు పడుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం అడ్రస్ లేకుండా పోయారు. పోనీ పుట్టినరోజు కదా, ముందుగానే ఏదైనా వెకేషన్ కి వెళ్లారనుకుందాం. కనీసం సోషల్ మీడియాలో అయినా అలర్ట్ గా ఉండి, పార్టీ శ్రేణులకు సందేశం అయినా ఇవ్వాలి కదా. కనీసం ఆ పని చేయడానికి కూడా టైమ్ లేదనుకుందాం. బర్త్ డే రోజు అంత బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం సైలెంట్ గా అయినా ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ ట్వీట్లు చూస్తుంటే జనాలు ఛీ కొట్టేలా ఉన్నాయి, చీదరించుకునేలా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పురి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ వారికి బదులిచ్చారు. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని ఎక్కడలేని వినయం ఒలకబోస్తూ ట్విట్టర్లో బదులిచ్చారు. పుట్టినరోజు ట్వీట్లకు బదులివ్వడం తెలిసిన జనసేనాని కనీసం జనం కష్టాల్లో ఉంటే పరామర్శకోసం అయినా ట్విట్టర్ ని ఎందుకు ఉపయోగించలేదనేదే అసలు ప్రశ్న.
https://x.com/PawanKalyan/status/1830596802363453721
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఇడుపుల పాయ వెళ్లిన జగన్.. ఏపీలో వరదల పరిస్థితి తెలిసి హుటాహుటిన విజయవాడ వచ్చారు. వరద నీటిలో దిగి ఆయన ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించారు. అటు సీఎం చంద్రబాబు అర్థరాత్రి సమీక్షలతో అధికారుల్ని హడావిడి పెట్టి మరీ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మధ్యలో పవన్ కల్యాణ్ మాత్రమే కష్టకాలంలో జనాలకు కనపడకుండా వెళ్లిపోయి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. పవన్ సైలెంట్ గా ఉన్నా పెద్ద వ్యతిరేకత వచ్చేది కాదు, పుట్టినరోజు ట్వీట్లకు థ్యాంక్స్ చెప్పేందుకు ఆన్ లైన్ లోకి రావడంతో.. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ప్రజల కష్టాల్లో ఉంటే కనిపించని నాయకుడు పవన్ అని ఎద్దేవా చేస్తున్నారు.