YouTube channel subscription banner header

పాల్ రూపంలో పవన్ కి మరో కష్టం

Published on

వరదబాధితులను పరామర్శించే విషయంలో పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల తర్వాత తీరిగ్గా ఆయన వచ్చినా కేవలం ప్రెస్ మీట్ కే పరిమితమయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనకు కేఏ పాల్ రూపంలో పెద్ద కష్టం వచ్చింది. పాల్ కామెడీ చేస్తారా, ప్రచారం కోసం చేస్తారా అనే విషయం పక్కనపెడితే ఓ పడవ వేసుకుని సింగ్ నగర్ లో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు పాల్. వరద బాధితులపై కనీసం ఆయనకు ఉన్న శ్రద్ధ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేకుండా పోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి. పాల్ తో పోలిక పెట్టి మరీ పవన్ ని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

https://x.com/GOAT_078/status/1830961953059242243

ఆక్రమణల వల్లే సింగ్ నగర్ మునిగిపోయిందని చెప్పిన కేఏపాల్.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే సర్దుకున్నారు. ప్రజలు ఆక్రమణలు చేయలేదని, ప్రభుత్వమే పార్కులకోసం, ఇతర స్థలాలకోసం కరకట్టను ఆక్రమించిందన్నారు. ప్రపంచమంతా గ్లోబల్ పీస్ సంస్థతో తాను రిలీఫ్ వర్క్ చేశానని, ఏపీలో కూడా ఆ పని తనకు చాలా సులభం అని చెప్పారు. హైడ్రా లాంటి వ్యవస్థలు ఏపీకి కూడా కావాలన్నారు. ఆక్రమణలు తొలగించాలని, గతంలో ముఖ్యమంత్రులు ఎందుకా పని చేయలేదని ప్రశ్నించారు. 2,300మందికి పైగా ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని సరికొత్త నెంబర్ చెప్పి అందరినీ షాక్ కి గురిచేశారు పాల్. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారాయన.

https://x.com/sakshitvdigital/status/1830908948108480737

అదానీ, అంబానీలకు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి కూడా వరద సాయం చేయాలన్నారు కేఏపాల్. ఏపీకి, తెలంగాణకు చెరో పదివేల కోట్లు పంపించాలన్నారు. పవన్ కల్యాణ్ పై కూడా పాల్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు చేతగాకపోతే తాను కోటి లక్షలు తెస్తానని స్పష్టం చేశారు. మొత్తమ్మీద పవన్ కంటే కేఏ పాల్ బెటర్ అని అంటున్నారు నెటిజన్లు. డిప్యూటీసీఎం హోదాలో ఉండి కూడా పవన్ విజయవాడకు మొహం చాటేశారని, కేఏపాల్ తమకోసం పడవ వేసుకుని వచ్చారని అంటున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...