తమ పార్టీ మూడు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తోందని, వాటిలోని అసెంబ్లీ స్థానాలను లెక్క వేసుకుంటే మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లవుతుందని అన్నారు. దీన్నిబట్టి చూస్తే పవన్ కల్యాణ్ తిక్కకు కూడా ఓ లెక్క ఉన్నట్లే అనిపిస్తోంది. అదే సమయంలో కాపు నేత హరిరామ జోగయ్యకు పవన్ కల్యాణ్ ఆ విధంగా సమాధానం ఇచ్చారని కూడా అనుకోవచ్చు. జనసేన 40కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని హరిరామ జోగయ్య అంటూ వస్తున్నారు.