తండ్రి మహానేత.. దాదాపు ఓ మూడు దశాబ్ధాల పాటు తెలుగు రాజకీయాలను శాసించిన నాయకుడు.. రెండు సార్లు సీఎంగా పని చేసి తెలుగు ప్రజల మదిలో రాజన్నగా చెరగని ముద్ర వేసుకున్న జనహృదయ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సోదరుడు తండ్రి వైఎస్సార్ బాటలో నడుస్తూ.. పార్టీ పెట్టి నాటి రాష్ట్ర,కేంద్ర పాలకపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కుట్రలు, కుతంత్రాలను సైతం తట్టుకుని గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీ స్థానాలను ఇటు 151 ఎమ్మెల్యే స్థానాలను.. అటు 22 ఎంపీ స్థానాలను గెలుపొంది ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అలాంటి నేతల వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుత ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారం.. సమావేశాలల్లో ఆమె మాట్లాడుతున్న మాటల తీరును చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ “జగనన్న పులి.. సింహాం అంటూ వైసీపీ నేతలు.. అభిమానులు సోషల్ మీడియా(social media)లో.. ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ ఊగిపోతున్నారు.. ఎందుకు జగనన్న సింహాం.. పులి.. అని “ఆమె వైసీపీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు.
దీనికి కౌంటరుగా వైసీపీ శ్రేణులు తన తండ్రి మహనేత వైఎస్సార్ అకాల మరణంతో ప్రాణాలు వదిలిన వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ల కుటుంబాలను ఆదుకోవడానికి పాదయాత్ర చేసినందుకు మా జగనన్న పులి.. సింహామే.., నాటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టి కుట్రలు పన్నినా.. అఖరికి చనిపోయిన మహానేత వైఎస్సార్ పై అక్రమ కేసులు పెట్టినా తట్టుకుని నిలబడినందుకు సింహాం..పులి.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే విధంగా వ్యవహరించినా.. భరించి ప్రజల తరపున తన తండ్రికిచ్చిన మాట ప్రకారం పోరాడి అధికారంలోకి వచ్చాడు..ఆ తర్వాత పసిపిల్లల నుండి పండు ముసలి వరకు.. అక్క చెల్లెల్లు.. అన్నతమ్ముళ్లు.. రైతన్నలు.. కార్మిక.. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేసి ప్రతి ఇంటిలో వైఎస్సార్ కు ఇటు తనకు గుడి కట్టుకునేలా పాలించినందుకు మా జగనన్న సింహాం.. పులి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.. సాక్షాత్తు వైఎస్సార్ కుటుంబాన్ని నడిరోడ్డుపైకి లాగిన.. చనిపోయిన ఆ మహానేత వైఎస్సార్ పై అక్రమ కేసులెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు జగన్ గురించి వైఎస్ షర్మిల మాట్లాడం చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని చురకలు అంటిస్తున్నారు.