YouTube channel subscription banner header

రామోజీ బండారం బయటపెట్టిన పోసాని..!

Published on

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. రామోజీ బండారం బయటపెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిలను రామోజీనే తిట్టారని ఆయన గుర్తు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. పవన్ వ్యక్తిగత విషయాలు ప్రచారంలో వచ్చేలా చేసింది రామోజీనేనని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం పవన్.. రామోజీకి నీతిమంతుడిలా కనబ‌డుతున్నాడా అని ప్రశ్నించారు.

కుట్రలతో ఎన్టీఆర్‌ దగ్గర పార్టీని లాక్కున్నది చంద్రబాబు కాదా? వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ సీఎం అయితే తాము ఏమైపోతామోననే భయం రామోజీ, చంద్రబాబులో మొదలైందని పోసాని అన్నారు.

చంద్రబాబు అవకాశవాది అని, తన స్వలాభం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడన్నారు. చంద్రబాబు మోసాలు చేస్తాడు కాబట్టే జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటాడన్నారు. మార్గదర్శి సంస్థను రామోజీ పెట్టింది ఎవరి డబ్బుతో అని పోసాని ప్రశ్నించారు. అందులో ఉన్న డబ్బంతా రామోజీ పందికొక్కులా తిన్నారని ఆరోపించారు.

మానవత్వం, స్నేహభావం ఉన్నవారే వలంటీర్లని, అలాంటి వారిపైనే విష ప్రచారం చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రికను ఆఖరికి టాయిలెట్‌ పేపర్‌గా మాత్రమే వాడతారని ఎద్దేవా చేశారు. పచ్చిగా మాట్లాడటం తప్పుకాదు.. అబద్ధం చెప్పడం తప్పని ఆయన అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు కోసమేనని జరుగుతున్న చర్చపై కూడా పోసాని మాట్లాడారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నమాట వాస్తవమేనని, కానీ అందుకు బీజేపీ అంగీకరిస్తే.. ఆ పార్టీకి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని పోసాని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు అడ్డగోలుగా చేసిన దూషణలను మర్చిపోతారని తాను అనుకోవడం లేదన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...