YouTube channel subscription banner header

మహిళలను గౌరవించేలా పిల్లలను తీర్చిదిద్దాలి

Published on

మహిళలను గౌరవించేలా పిల్లలను తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలపై గౌరవమనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలో చూపించాలని చెప్పారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. మహిళల‌ గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టే విధంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యతని స్పష్టం చేశారు. ఏ సమాజ అభివృద్ధికైనా అక్కడి మహిళల స్థితిగతులే కీలక ప్రమాణమని చెప్పారు. విద్యార్థుల్లో సున్నితత్వం, నిజాయితీని పెంపొందించడంతోపాటు వారిని ఔత్సాహికులుగా మలచడం ఉపాధ్యాయుల కర్తవ్యమని వివరించారు.

ప్రజలు కారుణ్యం, నైతికత అలవర్చుకోవాలని ముర్ము చెప్పారు. ఇతరుల సంక్షేమం కోసం పనిచేయడంలోనే జీవితానికి అర్థం ఉందని తెలిపారు. ఈ విలువలను ముందు తరాలను అందించడం ఉపాధ్యాయుల విధి అని చెప్పారు. బోధన అనేది మానవ వికాసానికి సంబంధించిన పవిత్ర కార్యమని, పిల్లల్లో సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి కోరారు. గొప్ప ఉపాధ్యాయులు.. గొప్ప దేశాన్ని నిర్మించగలరని, మన టీచర్లు దేశాన్ని ప్రపంచ నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తారనే విశ్వాసం ఉందని ముర్ము అన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...