YouTube channel subscription banner header

పులివెందులలో టీడీపీకి షాక్… వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి!

Published on

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలు ఒక పార్టీకి గుడ్ బై చెబుతూ మరో పార్టీ పంచన చేరుతున్నారు. ఇప్పటికే పలు పార్టీలలో రాకపోకలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా పులివెందులలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్.వి. సతీష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతూ వైసీపీలోకి చేరనున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, సన్నిహితులతో సతీష్ రెడ్డి సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్న తరుణంలో చంద్రబాబు, నారా లోకేష్‌పై ఆరోపణలు చేశారు. గత నాలుగున్నర సంవత్సర కాలం పాటు పులివెందలలో టీడీపీకి ఏజెంట్లు లేరని ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉండే స్థాయికి తాను పార్టీని తీసుకువచ్చానని తెలిపారు. గత నాలుగున్నర సంవత్సర కాలంలో తనకు చంద్రబాబును కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు.

“గతంలో ఎవరినైతే శత్రువులుగా భావించానో, ఎవరిపై అయితే పోటీ చేశానో వారి నుంచే నాకు పిలుపు వచ్చింది. వైసీపీ పార్టీ వాళ్లు నన్ను పిలిచిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ వారికి నేను గుర్తుకొచ్చాను“ అంటూ సతీష్ రెడ్డి టీడీపీపై ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్ రెడ్డి కలసి సతీష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. సతీష్ రెడ్డి 2014, 19లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఏడాది జనసేన – టీడీపీ కూటమి ఏర్పడటంతో బీటెక్ రవిని పులివెందుల అభ్యర్థిగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో సతీష్ రెడ్డి వైసీపీ చెంతన చేరినట్టు తెలుస్తుంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...