జగన్ మీద కేసుల గురించి ప్రస్తావించిన రామోజీ, చంద్రబాబు మీదున్న అవినీతి కేసులను మాత్రం ప్రస్తావించలేదు. అలాగే లోకేష్ మీద కూడా అవినీతి కేసులున్నాయి. వీళ్ళని వదిలేస్తే కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, నారాయణ లాంటి చాలామంది తమ్ముళ్ళ మీద కూడా హత్య కేసులు, అవినీతి కేసులున్న విషయం రామోజీకి తెలియదా? వీళ్ళంతా పోటీ చేయటంలేదా?