బాబు ఇచ్చిన 24 సీట్లతో పవన్ కల్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తాడని సజ్జల ప్రశ్నించారు. ఈ మాత్రానికి పార్టీ ఎందుకు..? టీడీపీ ఉపాధ్యక్ష పదవో, రాష్ట్ర అధ్యక్ష పదవో తీసుకుంటే పోలా.. అంటూ ఎద్దేవా చేశారు. తానెక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్ ఉన్నాడని ఆయన తెలిపారు. ఎత్తిపోయిన టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతా.. అంటూ ధ్వజమెత్తారు