YouTube channel subscription banner header

అది ఆర్ట్.. ఆమె ఆర్టిస్ట్..!

Published on

రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు పెడితే.. జనంలో నుంచి కొంతమందిని మాట్లాడేలా ప్రోత్సహిస్తారు. అప్పటికప్పుడు ఎవరికో ఆ అవకాశం దక్కుతుందని సామాన్య జనం అనుకుంటారు కానీ, అదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆమధ్య సిద్ధం సభలు, బస్సుయాత్ర సమయంలో కూడా కొంతమంది జగన్ వద్దకు నేరుగా వచ్చేసేవారు. సెక్యూరిటీని కూడా తప్పించుకుని వాళ్లు నేరుగా జగన్ వద్దకు రావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించేది. వారికోసం బస్సుని కూడా సడన్ గా ఆపేసేవారు సిబ్బంది. చెప్పుల్లేకుండా, రోడ్డుపై కాళ్లు కాలుతున్నా పరిగెత్తేవారు కొందరు. వృద్ధులు, మహిళలు, పిల్లలు.. ఇలా అన్ని ఏజ్ గ్రూప్ ల నుంచి జనం నేరుగా జగన్ బస్సు దగ్గరకు వచ్చి ఆయతో ఫొటోలు దిగేవారు. ఇదంతా ఐప్యాక్ స్క్రిప్ట్ అని అప్పట్లో టీడీపీ విమర్శలు చేసేది. ఇప్పుడు చంద్రబాబుపై కూడా ఇలాంటి విమర్శలే మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చాక బాబు ప్రచారానికి మరీ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారని వైసీపీ కౌంటర్లిస్తోంది.

https://x.com/Kantham1897/status/1834420883097809302

తాజాగా ఏలూరు వరదలపై సమీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఓ మహిళ ఆయనపై పాట పాడింది. చంద్రుడా, ఓ చంద్రుడా అంటూ.. చంద్రబాబు ముందే ఆ పాట పాడి వినిపించింది. గతంలో పోలవరం దగ్గర జరిగిన జయము జయము చంద్రన్నా అనే భజన పాటను గుర్తు చేసింది. తాజాగా ఆమె చంద్రబాబుపై పాడిన పాట వైరల్ గా మారింది. వైసీపీ మాత్రం ఆమె గత వీడియోలను బయటకు తీసింది. టీడీపీ కార్యకర్త అయిన సదరు మహిళ గతంలో లోకేష్ యువగళం మీటింగ్ లో కూడా ఆవేశపూరిత ప్రసంగం చేసింది. ఆ వీడియోని వైసీపీ ఇప్పుడు వైరల్ చేస్తోంది.

తండ్రీ కొడుకులిద్దరూ సేమ్ ఆర్టిస్ట్ తోటి పొగిడించుకుంటున్నారని, కాస్త ఆర్టిస్ట్ లని అయినా మార్చాలని వైసీపీ అభిమానులు ట్విట్టర్లో కౌంటర్లిస్తున్నారు. సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత ఇలాంటి జిమ్మిక్కులన్నీ వెంటనే బయటపడిపోతున్నాయి. ప్రస్తుతం ఆ మహిళ పాత వీడియోలు, కొత్త వీడియో వైరల్ అవుతున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...