సినీ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘సరిపోదా శనివారం’ మరో మూడు రోజుల్లో, ఆగస్టు 29 గురువారం విడుదల కానుంది. వివేక ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని గ్యాంగ్‌లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని నాని అభిమానులు ధీమాగా ఉన్నారు. మూవీ రిలీజ్ రోజున బెన్‌ఫిట్ షో గురించి అభిమానులంతా హైరానా పడుతుండగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నామని.. తొలి షో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ రేపు (మంగళవారం) ప్రారంభమవుతాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. నాని నటించిన ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అడ్వాన్స్ సేల్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డేరింగ్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.