బీజేపీతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పెద్ద సాయం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులైన నేపథ్యంలో ముస్లింలు, ఇతర మైనారిటీలు కాంగ్రెస్ వైపు మళ్లుతారనే అంచనా ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. అయితే, టీడీపీ బీజేపీతో పొత్తు వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పొత్తుల వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తారనే భయంతో మైనారీటీలు వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కు వెళ్తాయని భావించిన మైనారిటీల ఓట్లు వైసీపీ వైపు మళ్లవచ్చునని అంచనాలు వేస్తున్నారు.
పలు జిల్లాల జయాపజయాల్లో ముస్లింలు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. ఆ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.
1) కడప … 90,000
2) కర్నూల్ …. 85,000
3) రాజాం పేట …. 70,000
4) నంద్యాల …. 70,000
5) గుంటూరు తూర్పు … 30,000
6) కదిరి …60,000
7) నెల్లూరు …. 60,000
8) శ్రీశైలం …. 47,000
9) హిందూపూర్ …. 55,000
10) ప్రొద్దుటూరు …. 55,000
11) పీలేరు … 50,000
12) అనంతపురం (అర్బన్ ) …. 55,000
13) ఆదోనీ …. 50,000
14) ఆళ్లగడ్డ … 50,000
15) నందికొట్కూర్ …. 40,000,
16) మదనపల్లి …50,000
17) గుంతకల్ … 45,000
18) పుంగనూరు … 45,000
19) విజయవాడ పశ్చిమం … 56,000
20) తాడికొండ … 35,000
21) చిలకలూరిపేట …. 40,000
22) పాణ్యం … 50,000
23) పలమనేరు … 45,000
24) బనగానపల్లి … 40,000
25) నరసారావు పేట .. 35,000
26) తిరుపతి … 40,000
27) నెల్లూరు (రూరల్ )… 45,000
28) గుంటూరు (వెస్ట్)… 40,000
29) రాజంపేట …. 35,000
30) గురజాల … 35,000
31) కోడుమూరు …32,000
32) పొన్నూరు … 35,000
33) సత్తెన పల్లి … 35,000
34) ఆత్మకూరు … 30,000
35) ఎమ్మిగనూరు ….. 32,000
36) కమలాపురం ….. 70,000
37) గిద్దలూరు ….. 30,000
38) పెనమలూరు …. 40,000
39) పెదకూరపాడు … 30,000
40) పులివెందుల … 30,000
41) తంబళ్లపల్లి …. 30,000
42) డోన్…. 30,000
43) మైదుకూరు … 30,000
44) విజయవాడ సెంట్రల్ … 30,000
45) నందిగామ …. 22,000
46) కొవ్వూరు … 32000
47) మంగళగిరి … 32,000
48) జమ్మల మడుగు … 30,000
49) ఒంగోలు … 22,000
50) మచిలీపట్టణం … 40,,000
51) ఏలూరు … 22,000
52) పర్చూరు … 22,000
53) పెనుకొండ … 21,000
54) రాయదుర్గం … 21,500
55) చంద్రగిరి … 25,000
56) ధర్మవరం … 22,000
57) ఉదయగిరి … 22,000
58) రాయచోటి … 1,00000
59) గన్నవరం ….. 35,000
60) విశాఖపట్నం .. 3,50000