YouTube channel subscription banner header

పీఎస్‌లో మ‌హిళ‌పై టీడీపీ నేత చెప్పుతో దాడి.. మ‌హిళా క‌మిష‌న్ ఏం చేస్తుంది

Published on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేత‌లు ఇష్టారీతిగా రెచ్చిపోతున్నారు. మొన్న వినుకొండ‌లో ర‌షీద్ హ‌త్య‌, నిన్న తాడిప‌త్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి, తాజాగా పోలీస్ స్టేష‌న్‌లోనే మ‌హిళ‌పై చెప్పుతో దాడి. స్టేష‌న్‌లో స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎదుటే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని అనుచ‌రుడు జ‌య‌చంద్రారెడ్డి చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన భవిత, సురేష్‌ దంపతులకు కొంత‌కాలంగా ఆర్థిక ప‌ర‌మైన గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇదే క్ర‌మంలో ఆ దంప‌తుల‌ను ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిపించాడు జ‌య‌చంద్రారెడ్డి. వారిని బెదిరించి, ఇష్టారీతిగా దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో బాధితులు చంద్ర‌బాబు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అధికార పార్టీ నేత కావ‌డంతో పోలీసులు సైతం ఫిర్యాదు స్వీక‌రించేందుకు నిరాక‌రించారు. దీంతో బాధితులు ఎస్పీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఎస్పీ ఆదేశాల‌తో సీఐ బాధితుల‌ను పీఎస్‌కు పిలిపించి విచార‌ణ ప్రారంభించారు. బాధితులకు సహాయంగా వారి బంధువు చంద్రమ్మతో స‌హా ప‌లువురు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

సీఐ స‌మాచారం మేర‌కు పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన టీడీపీ నేత జయచంద్రారెడ్డి సీఐ ముందే బాధితులను బెదిరిస్తూ అభ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషించ‌డం మొద‌లుపెట్టాడు. ఈ క్రమంలోనే బాధితులకు సాయంగా వచ్చిన ఓ మహిళను సీఐ స‌మ‌క్షంలోనే చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సద్దుమణిగేలా చేసేందుకు ఎమ్మెల్యే నాని అనుచరులు రంగంలోకి దిగారు. వారు స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసుల ఎదుటే ఓ మ‌హిళ‌కు ఇంత‌టి ఘోర‌మైన అవ‌మానం జ‌ర‌గ‌డంతో సామాన్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పీఎస్‌లో మ‌హిళ‌ల‌ను చెప్పుతో కొడితే మ‌హిళా క‌మిష‌న్ ఏం చేస్తుంద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...