YouTube channel subscription banner header

అరెస్ట్ కి ఏడాది.. కాదేదీ ప్రచారానికనర్హం

Published on

“స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కి ఏడాది” అంటూ టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది అవుతోందని, అప్పుడు జరిగిన ఆ ఘటన వల్లే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కూటమి విజయం సాధించిందని కూడా ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. అరెస్ట్ అయిన సందర్భాన్ని కూడా ఇలా ప్రచారం చేసుకోవచ్చా అని కొంతమంది నెటిజన్లు షాకవుతున్నారు.

https://x.com/Swathireddytdp/status/1832898633760436279

ఇక వైసీపీ కూడా ఈ అరెస్ట్ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం విశేషం. స్కిల్ స్కామ్ అరెస్ట్ కి ఏడాది అంటూ.. వైసీపీ అనుకూల హ్యాండిళ్లు ఓ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నాయి. బాబు అరెస్ట్ కి ఏడాది – జగనన్నా నువ్వు తోపు అంటూ మరికొందరు జగన్ ని హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ టైమ్ లో విదేశాల్లో ఉన్న జగన్, తిరిగొచ్చిన తర్వాత తొలిసారిగా ఆ ఘటనపై స్పందించిన వీడియోని మళ్లీ వైరల్ చేస్తున్నారు. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు ఎత్తారంటూ.. జగన్ పేల్చిన సెటైర్ ని గుర్తు చేస్తున్నారు.

https://x.com/KingRajiv/status/1832848670489710733

చంద్రబాబు అరెస్ట్ వల్ల తమకు మేలు జరిగిందని, ఆ ఘటనకు ఏడాది అయిన సందర్భంగా మరోసారి దాన్ని గుర్తు చేసుకుంటున్నామని టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే, చంద్రబాబుని అరెస్ట్ చేయించిన జగన్ గట్స్ కి ఏడాది అని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. గతంలో జగన్ అరెస్ట్ అయినా కూడా ఎప్పుడూ ఇలా యానివర్సరీలు చేయలేదు. పోనీ టీడీపీ కూడా జగన్ జైలుకెళ్లిన రోజు అంటూ విమర్శలు చేయలేదు. చంద్రబాబు విషయంలో మాత్రం అరెస్ట్ వ్యవహారానికి వార్షికోత్సవాలు మొదలయ్యాయి. ఇది తొలి వార్షికోత్సవం కాబట్టి హడావిడి కాస్త గట్టిగానే ఉంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...