TDP Super Six: ఆ బాక్సుల్లో ఏముందంటే ఒక లిక్కర్ ఫుల్ బాటిల్. దాంతో పాటు కొన్ని సిగిరెట్లు. మళ్ళీ ఆ సిగిరెట్ బట్ చుట్టూ గోల్డ్ కలర్లో కనిపించే లైనింగ్ పైన చంద్రబాబు బొమ్ముంది. తర్వాత నాలుగు స్వీట్లున్నాయి. దీంతో పాటు మందులోకి మంచింగ్ కింద చిప్స్ ప్యాకెట్ ఉంది. ఒక కండోమ్ ప్యాకెట్ కూడా పెట్టారండోయ్.
కండోమ్ ప్యాకెట్ ఎందుకు పెట్టారో పెట్టిన వాళ్ళకే తెలియాలి. ఆ కండోమ్ ప్యాకెట్ పైన టీడీపీ లోగో కూడా ఉంది. చివరగా బాక్స్ మూతకి లోపలవైపే ఒక గిఫ్ట్ కవరుంది. అందులో 5 వేలరూపాయలున్నాయి. ఈ ఆరింటిని కలిసి తమ్ముళ్ళు ముద్దుగా ‘సూపర్ సిక్స్’ అని చెప్పుకుంటున్నారు.