YouTube channel subscription banner header

టీడీపీ ‘సూపర్ సిక్స్’ భలేగుంది

Published on

తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ భలేగుందంటున్నారు. సూపర్ సిక్స్ అంటే అప్పుడెప్పుడో రాజమండ్రి మహానాడు సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు కావు. అప్పట్లో ఉచిత గ్యాస్, రైతులకు సాయం, మహిళకు నగదు సాయం, ఇంట్లో ఉండే ఆడపిల్లలకు చేసే ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల ఉద్యోగాలనే ఆరు హామీలను ప్రకటించారు. ఈ ఆరింటికి కలిసి చంద్రబాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకున్నారు. అంటే సూపర్ సిక్స్ అన్న పదం తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలో నుండి కాపీ కొట్టిందేలేండి.

పదమే కాదు చాలా హామీలను కూడా చంద్రబాబు కాపీ కొట్టేసి ఈ హామీల ప్రకటనకు తాను చాలా కసరత్తు చేశానని, కష్టపడ్డానని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. అయితే తాజా సూపర్ సిక్స్ మాత్రం అచ్చంగా తాడేపల్లిగూడెం జెండా బహిరంగసభకు వచ్చిన జనాల కోసం టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ సూపర్ సిక్స్ ఏమిటంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్. ఒక పెద్ద బాక్స ను టేప్‌తో అంటించి గిఫ్ట్ బాక్స్ లాగ తయారుచేసి బహిరంగసభకు వచ్చిన జనాలకు పంపిణీ చేశారు. ఎంత మందికి పంపిణీ చేశారనే విషయం తెలీదు కానీ చాలామంది చేతిలో బాక్సులు కనిపించాయి.

ఆ బాక్సుల్లో ఏముందంటే ఒక లిక్కర్ ఫుల్ బాటిల్. దాంతో పాటు కొన్ని సిగిరెట్లు. మళ్ళీ ఆ సిగిరెట్ బట్ చుట్టూ గోల్డ్ కలర్లో కనిపించే లైనింగ్ పైన చంద్రబాబు బొమ్ముంది. తర్వాత నాలుగు స్వీట్లున్నాయి. దీంతో పాటు మందులోకి మంచింగ్ కింద చిప్స్ ప్యాకెట్ ఉంది. ఒక కండోమ్ ప్యాకెట్ కూడా పెట్టారండోయ్. కండోమ్ ప్యాకెట్ ఎందుకు పెట్టారో పెట్టిన వాళ్ళకే తెలియాలి. ఆ కండోమ్ ప్యాకెట్ పైన టీడీపీ లోగో కూడా ఉంది. చివరగా బాక్స్ మూతకి లోపలవైపే ఒక గిఫ్ట్ కవరుంది. అందులో 5 వేల రూపాయలున్నాయి. ఈ ఆరింటిని కలిసి తమ్ముళ్ళు ముద్దుగా సూపర్ సిక్స్ అని చెప్పుకుంటున్నారు.

రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల సంగతి దేవుడెరుగు తాడేపల్లిగూడెంలో ఇచ్చిన సూపర్ సిక్స్ మాత్రం చాలా బాగుందని తమ్ముళ్ళు, క్యాడర్ చెప్పుకుంటున్నారు. ఇక ముందు జరిగే బహిరంగసభల్లో కూడా ఇలాంటి సూపర్ సిక్స్ గిఫ్ట్ బాక్సులు ఇస్తారేమో చూడాలి. గిఫ్ట్ బాక్స్ పైన చంద్రబాబు, లోకేష్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ సూపర్ సిక్స్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సంబంధంలేదనే అనుకోవాలా?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...