జనసేన, టీడీపీ మధ్య 20 సీట్ల పొత్తు ఒప్పందం ఖరారైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ, టికెట్ల కేటాయింపు విషయంలో గోదావరి జిల్లాల్లోని జనసేన నేతల్లో గుబులు చెలరేగుతున్నాయి.
పశ్చిమ గోదావరి
జనసేన 4 సీట్లు(భీమవరం, నరసాపురం, పోలవరం, + 1) అడిగిందని, టీడీపీ అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల నుండి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆందోళన మొదలైంది. పశ్చిమ గోదావరిలో 4, విశాఖపట్నంలో 6 సీట్లు అడగడంపై గోదావరి నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తణుకు
గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయినందుకు పవన్ క్షమాపణలు చెప్పి, ఈసారి టికెట్ ఖాయమని హామీ ఇచ్చారు. దీంతో విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఖాయమని భావిస్తున్నారు. కానీ టికెట్ వస్తుందనే గ్యారెంటీ మాత్రం కనపడటం లేదు.
తాడేపల్లిగూడెం
బొలిశెట్టి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, పార్టీకి ఊపు తెచ్చారు. టికెట్ వస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆయనకు కూడా టికెట్ వస్తుందనే ఆశ కనిపించడం లేదు.
నిడదవోలు
2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు జనసేన ఓట్లే కారణం. దీంతో.. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమ గోదావరిలో 4 సీట్లు మాత్రమే ఖాయమని, మిగిలిన ఒకటి ఖరారు కావాల్సి ఉందని ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలే.. జనసేన పార్టీ నేతల్లో ఆందోళనకు కారణమవ్వడం గమనార్హం. ఇక టికెట్ల ఖరారుపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో గుబులు మొదలైంది. పార్టీ నాయకత్వం నుండి స్పష్టత రావాలని కోరుకుంటున్నారు.