జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్‌గా ఎన్నికల సంఘం ప్రకటించడంపై, దాన్ని ఇతరులకు కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే పడి ఏడుస్తున్నారు. వైఎస్ జగన్ కుట్ర చేశారని ఆడిపోసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పోటీలో లేని చోట ఎన్నికల సంఘం కామన్ సింబల్‌గా గాజు గ్లాసును ప్రకటించింది. రాష్ట్రంలోని 16 అసెంబ్లీ స్థానాల్లో, 3 లోకసభ స్థానాల్లో ఈసీ గాజు గ్లాసును ఇతరులకు కేటాయించింది.