YouTube channel subscription banner header

రైతులకు ఐడీకార్డ్.. కేంద్రం కసరత్తులు

Published on

రైతులకోసం తెచ్చిన నల్ల చట్టాలతో బీజేపీ పరువు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆ పార్టీకి లోక్ సభ స్థానాల్లో కోత పడటానికి ఆ చట్టాలు, వాటిని సమర్థించుకునే క్రమంలో రైతులపై విరిగిన లాఠీలే కారణం అనే వాదన కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ రైతులకోసం అంటూ సరికొత్త హడావిడి మొదలు పెట్టింది కేంద్రం. ఆధార్ లాగా రైతులకు ప్రత్యేక నెంబర్ కేటాయిస్తామంటోంది. దీని ద్వారా రైతులకు అనేక లాభాలు కలుగుతాయంటూ లీకులిస్తోంది.

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేస్తామని చెబుతున్న కేంద్రం.. ఆధార్ తరహాలో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక నెంబర్ కేటాయిస్తామంటోంది. వీటి ద్వారా ఐడీ కార్డ్ లు కూడా జారీ చేయబోతోంది. అక్టోబర్ నుంచి ఈ పథకం ప్రారంభిస్తామంటున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి. త్వరలో విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారికి ఐడీ కార్డ్ లు ఇస్తారు. 2025 మార్చి నాటికి 5 కోట్ల మంది అన్నదాతలకు ఈ ఐడీకార్డ్ లు మంజురు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అమలు చేశామని, ఫలితాలున్నాయని, అందుకే 19 రాష్ట్రాలు ఇందులో పాల్గొనడానికి అంగీకరించాయన్నారు. రైతులకు అందించే ప్రభుత్వ పథకాలు, కనీస మద్దతు ధరకోసం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఈ యునిక్ నెంబర్ ని, ఐడీ కార్డ్ ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సిన వేళ.. కేంద్రం రైతులకు గేలం వేసేందుకే ఈ ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

రైతులకు మేలు చేయాలంటే వారికి ప్రత్యేకంగా నెంబర్లు కేటాయించాల్సిన పనిలేదు. గిట్టుబాటు ధర కల్పించాలి, దళారుల దాష్టీకం నుంచి వారిని బయటపడేయాలి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పథకాలతో ఆదుకోవాలి. కానీ రైతులకు పెట్టుబడి సాయం అంటూ పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టి నామమాత్రపు ఆర్థిక సాయంతో కేంద్రం హడావిడి చేస్తోంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు రైతులకు ఐడీ కార్డ్ లు ఇస్తామంటున్నారు. వీటివల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటో వేచి చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...