YouTube channel subscription banner header

చెప్పింది వింటే చంద్రబాబు ఎందుకు అవుతాడు..?

Published on

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరాడు. అప్పుడు ప్రధాని మోదీ కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాడు. ప్రధాని మోదీపై విమర్శల వర్షం కూడా కురిపించాడు. అయితే.. ఆ సమయంలో తొందరపడవద్దని, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లొద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. కానీ.. చంద్రబాబు వింటాడా..? వినకపోగా రెచ్చిపోయి విమర్శలు చేశాడు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి చెలరేగిపోయాడు. ఫలితం.. ఆ ఎన్నికల్లో గెలవకపోగా.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తామనే నమ్మకం లేకుండా మిగిలిపోయాడు.

ఈ సారి మళ్లీ ఎన్నికల్లో గెలవాలి అంటే.. పాత ఫార్ములానే వాడాలి అని అనుకుంటున్నాడు. మళ్లీ ఎన్డీఏలో చేరేందుకు పాకులాటలు మొదలుపెట్టాడు. బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టాడు. అయితే.. రీసెంట్‌గా వెంకయ్య నాయుడు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు,

2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడానికి సిద్ధపడిన సమయంలో గుంటూరులో చంద్రబాబు తనను కలిశారని, ఎన్డీఏలో కొనసాగాలని తాను చంద్రబాబుకు చెప్పానని, అందుకు చంద్రబాబును ఒప్పించడానికి ప్రయత్నించానని, అయితే చంద్రబాబు అంగీకరించలేదని ఆయన చెప్పారు. ఎన్డీఏలో కొనసాగితే టీడీపికి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచే అవకాశాలు తగ్గుతాయని టీడీపీ భావించింది. బిజెపిపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, అందువల్ల ఎన్డీఏ నుంచి వైదొలగడమే మంచిదని భావిస్తున్నానని చంద్రబాబు అన్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.

ఎన్డీఏ నుంచి వైదొలిగితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెండు పనులు చేయవద్దని చంద్రబాబుకు సూచించానని, ఒకటి.. నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రెండు… కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ కలవకూడదని తాను చేసిన సూచనలు అని ఆయన వివరించారు. అయితే, వెంకయ్యనాయుడు చేసిన రెండు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన మంచి కోసం ఎంత చెప్పిని వినకుండా.. మోడీని తిడితే తనకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. ఫలితంగా.. ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు.. మళ్లీ గెలవడం కోసం ఆ బీజేపీ చెంత చేరడానికి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అప్పుడు అసహ్యించుకుంటారేమో అనుకుని విమర్శించిన బాబు.. ఇప్పుడు మళ్లీ వారి చెంత చేరితే.. అసహ్యించుకోరా.. ఆ విషయాన్ని చంద్రబాబు ఎలా మరచారు..?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...