YouTube channel subscription banner header

వరద సాయం అడిగితే వీఆర్వో చెంపదెబ్బ

Published on

విజయవాడ అజిత్ సింగ్ నదర్ షాదిఖానా రోడ్ లో వీఆర్వో దురుసు ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. వరద బాధితులకోసం నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు రేషన్ బండి ఆ వీధికి వచ్చింది. బండితోపాటు వీఆర్వో, ఇతర సిబ్బంది, పోలీసులు అక్కడికి వచ్చారు. స్థానికులు తమ గోడు వారికి చెప్పుకున్నారు. వరదల సమయంలో కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వలేదన్నారు. తమ కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా వీఆర్వో ముందు వారు తమ అసంతృప్తి వ్యక్తపరిచారు. అయితే సదరు వీఆర్వో మరింత ఆగ్రహానికి గురయ్యారు. బాధితులు సెల్ ఫోన్ లో ఆ వ్యవహారం అంతా రికార్డ్ చేస్తుండే సరికి ఆమె మరింత కోపం తెచ్చుకున్నారు. సెల్ ఫోన్ తో రికార్డ్ చేస్తున్న స్థానికుడిని చెంపదెబ్బకొట్టారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యే సరికి సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

https://x.com/YSRCPBrigade/status/1833098020432621873

బాధితులు ఆవేదనలో ఉంటారు, ఆగ్రహంతో ఉంటారు, వారితో జాగ్రత్తగా వ్యవహరించండి.. అంటూ సీఎం చంద్రబాబు గతంలో సూచించిన విషయం తెలిసిందే. బాధితులతో కొంతమంది అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే సమాచారం ఉందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారాయన. అయితే ఇప్పుడు వీఆర్వో తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. వాటర్ బాటిల్స్ ఇవ్వలేదంటూ స్థానికులు ప్రశ్నించగా ఆమె కోపంతో వారిపై దాడికి దిగారు. పోలీసుల ఎదుటే ఈ దాడి జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో వరద సాయం అందరికీ అందలేదనే విషయం తెలిసిందే. అరకొర సాయంతో స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఈ సందర్భంలో ఈరోజు వీఆర్వోని చూడగానే వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమని పట్టించుకోలేదని ఆమెను నిలదీశారు. దీంతో ఆమె కూడా ఆగ్రహంలో వారిపై చేయి చేసుకున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...