తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ చీటికిమాటికి జగన్మోహన్ రెడ్డి లేదా గ్రంధిని చాలెంజ్‌లు చేస్తుండటమే విచిత్రంగా ఉంది. తాను ఎవరికి భయపడను అన్నది పవన్ ఊతపదమంతే. వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో గెలుపుపై బాగా అనుమానంతో ఉన్నారు కాబట్టే పోటీచేసే నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారు. నిజంగానే పవన్ ధైర్యస్తుడు అయితే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఎప్పుడో ప్రకటించుండేవారే.