YouTube channel subscription banner header

బీజేపీతో పొత్తుకు ప్రాతిపదిక ఏది చంద్రబాబూ..

Published on

కూటమి మేనిఫెస్టో అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్కదాన్ని విడుదల చేశారు. ఇందులో కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ పాత్ర ఏ మాత్రం లేదు. ఆ మేనిఫెస్టోకూ తమకూ సంబంధం లేదని బీజేపీ నేతలు బాహాటంగానే చెప్పుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావని కూడా వారు అంటున్నారు. ఈ స్థితిలో సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు ప్రకటించారు. కానీ ముఖ్యమైన అంశాలను పొందుపరచలేదు.

కూటమి కట్టినప్పుడు ఆ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుంది. ఉమ్మడిగా లక్ష్యాలను సాధిస్తామనే హామీని ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విషయంలో అది జరగలేదు. పొత్తులకు ఉమ్మడి లక్ష్యాలు ఏవీ లేవని దీంతో తేలిపోయింది.

ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కొత్త పథకాలను తన మేనిఫెస్టోలో చేర్చలేదు. కొన్ని పథకాలకు సొమ్మును మాత్రం పెంచారు. రాష్ట్ర వనరులను, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఆయన కొత్త హామీలు ఇవ్వలేదు. ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇచ్చారు. వాటిని ఇప్పటికే కొనసాగిస్తున్నారు కాబట్టి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి తప్పకుండా కొనసాగుతాయని అనుకోవాల్సి ఉంటుంది.

కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర బడ్జెట్‌ను మించి ఖర్చయ్యే సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాటిని అమలు చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసిపోతూనే ఉంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదు. కేవలం 12 శాతం మాత్రమే అమలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పారు. తమ కూటమిలో భాగమైన బీజేపీ విధానానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఉచితాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు.

ఇకపోతే, ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ స్పష్టంగా చెప్పుతూ వస్తోంది. దానికి సంబంధించిన హామీ కూటమి మేనిఫెస్టోలో లేదు. ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పలేకపోయారు. అదే విధంగా యూసీసీ, ఎన్ఆర్పీల విషయంలో చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయలేదు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీ విధానమే తన విధానంగా చంద్రబాబు భావిస్తున్నారని అనుకోవాలి.

ప్రత్యేక హోదా విషయంలోనే చంద్రబాబు గతంలో తాను ప్రధాని మోదీని వ్యతిరేకించినట్లు చెప్పారు. కానీ ప్రత్యేక హోదా అంశం మేనిఫెస్టోలో లేదు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పలేదు. గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని తానే వదులుకున్నారు కాబట్టి, కొత్తగా బీజేపీ నుంచి గానీ ప్రధాని మోదీ నుంచి గానీ ఏ విధమైన హామీని పొందలేదు కాబట్టి గత వైఖరికే చంద్రబాబు కట్టుబడి ఉన్నారని భావించాల్సి ఉంటుంది.

మొత్తం మీద, సిద్ధాంతపరమైన, విధానపరమైన ఏకాభిప్రాయం లేకుండా కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే చంద్రబాబు జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేస్తున్నారని అనుకోక తప్పదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...