YouTube channel subscription banner header

మొబైల్‌తో మెదడు క్యాన్సర్‌ భయం లేదు.. తేల్చి చెప్పిన డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం

Published on

మొబైల్‌ ఫోన్‌ వినియోగం వల్ల మెదడు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు లేవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ అధ్యయనం చేయించడం గమనార్హం. ఈ అంశంపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. మొబైల్‌ ఫోన్‌ని అధికంగా వినియోగించడం వల్ల దాని రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్‌కి కారకమయ్యే గ్లియోమా కణితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో జనంలో కొన్ని అపోహలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా అధ్యయనం అవన్నీ అపోహలేనని తేల్చిచెప్పింది. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 5 వేల అధ్యయనాలను విశ్లేషించినట్టు వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఈ పరిశోధనను ఆస్ట్రేలియన్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ న్యూక్లియర్‌ సేఫ్టీ ఏజెన్సీ (ఏఆర్‌పీఏఎన్‌ఎస్‌ఏ) చేసింది. ఈ ఏజెన్సీ సమగ్రంగా అధ్యయనం చేసి, భారీ స్థాయి డేటాను విశ్లేషించి మొబైల్‌ ఫోన్ల వినియోగానికి, మెదడు క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దాదాపు 5 వేల అధ్యయనాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు స్పష్టం చేసింది. వైర్‌లెస్‌ సాంకేతికతతో వెలువడే రేడియో తరంగాలు మానవ ఆరోగ్యానికి హాని కలిగించేవి కావని స్పష్టం చేసింది. మొబైల్‌ ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్‌కు కారకమయ్యే గ్లియోమా కణితి వచ్చే అవకాశం లేదని, ఇతర మెదడు సంబంధిత క్యాన్సర్లు కూడా రావని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనాన్ని ‘ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌’ ప్రచురించడం గమనార్హం.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...