ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని, ఆ సంక్షేమ పథకాల సొమ్మును కూడా పెంచి ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుతున్నారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పేరిట మరికొన్ని కొత్త పథకాలను కూడా ఆయన ప్రకటించారు. ఈ మొత్తం పథకాలను అమలు చేయడానికి ఏటా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇవన్నీ ఎలా అమలు చేస్తారంటే, సంపద సృష్టిస్తానని చెప్పుతున్నారు. ఆ సంపదను ఎలా సృష్టిస్తారనే విషయం మాత్రం చెప్పడం లేదు.