YouTube channel subscription banner header

వివేకాను హీరోగా ప్రొజెక్టు చేస్తున్నారా?

Published on

హత్యకు గురైన వివేకానందరెడ్డికి హీరోయిజం కట్టబెట్టేందుకు భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, వైఎస్సార్ కూతురు షర్మిల పడరాని పాట్లు పడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా పార్టీని అధికారంలోకి తేచ్చే విషయంపైనే వివేకా ఆలోచించేవారని సౌభాగ్యమ్మ, తనను ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి చేశారని షర్మిల, అవినాష్ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసమే తన తండ్రి ఆలోచించేవారని సునీత విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే వివేకాకు లేని హీరోయిజాన్ని వీళ్ళంతా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే వివేకాకు సొంత అస్తిత్వం ఎప్పుడూ లేదు. స్వయంశక్తితో ఎదిగిన నేత అంతకన్నాకాదు.

వైఎస్సార్ బతికున్నంతకాలం వైఎస్ సోదరుడిగానే గుర్తింపుండేది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబాయ్‌గా చెలామణి అయ్యారంతే. వైసీపీని పెట్టింది జగన్, ఎన్నికల్లో కష్టపడింది జగన్. తన రెక్కల కష్టం మీదే 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇందులో కొంతమంది వాళ్ళసొంత బలంమీద గెలిచినవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 2014-19 మధ్య వైసీపీని దెబ్బకొట్టి జగన్‌ను రాజకీయంగా భూస్థాపితం చేసేయాలని చంద్రబాబునాయడు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొన్నది కూడా జగనే.

2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసింది, ఎన్నికల్లో పార్టీ సాధించిన అఖండ విజయానికి కారకుడు కూడా జగనే. పార్టీ గెలుపోటములు మొత్తానికి జగనే కారణమైనప్పుడు ఇక వివేకా పాత్రేముంది? భార్య సౌభాగ్యమ్మ చెప్పినట్లుగా పార్టీని వివేకా అధికారంలోకి తెచ్చేదేముంటుంది. కడప ఎంపీగా తనను పోటీ చేయమని వివేకా ఒత్తిడి చేశారని షర్మిల చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి చేయటానికి వివేకా ఎవరు? అన్నీ అనుకూలిస్తే పోటీ చేస్తానని హామీ ఇవ్వటానికి షర్మిలెవరు? టికెట్ ఇవ్వాల్సింది జగన్ అయినప్పుడు మధ్యలో వివేకా పెత్తనం ఏమిటి?

ఎంపీ టికెట్‌కు పోటీ వస్తాడనే వివేకాను చంపించేశారని కొందరు ఆరోపించటం, చంద్రబాబు, ఎల్లో మీడియా పదేపదే ఆరోపించటం విచిత్రంగా ఉంది. అసలు కడప ఎంపీ టికెట్ వివేకాకు జగన్ ఇస్తారని ఎలా అనుకున్నారు? సిట్టింగ్ ఎంపీగా అవినాష్ గెలుపున‌కు వివేకా పనిచేస్తుంటే ఇక టికెట్‌కు వివేకా పోటీ వచ్చేదేముంది? వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే పార్టీకి అన్నీ వివేకానే అన్నట్లుగా ఉంది. నిజంగానే వివేకా అంతటి గట్టి నేత అయితే విజయమ్మకు వ్యతిరేకంగా పులివెందులలో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు ఎన్నో చూస్తే కెపాసిటి తెలిసిపోతుంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...