YouTube channel subscription banner header

షర్మిలకు అంత సీనుందా?

Published on

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే బాగా హైప్ వస్తుంది. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని, వైసీపీ వ్యతిరేక ఓట్లంతా కాంగ్రెస్ లాగేసుకుంటుందని లెక్కలు క‌ట్టేసింది ఎల్లో మీడియా. విచిత్రం ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా రాయాలన్న తొంద‌ర‌లో లాజిక్కులు కూడా మరచిపోతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా టీడీపీ కూటమి లాగేసుకుంటుందట. వైసీపీ వ్యతిరేకత ఓట్లన్నీ కాంగ్రెస్ తీసేసుకుంటుందట.

జగన్ అంటే ఎల్లో మీడియాకు గుడ్డి వ్యతిరేకత ఉందన్న విషయం అందరికీ తెలుసు, కానీ మరీ ఇంత అన్యాయంగా కూడా వార్తలు రాస్తారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎల్లో మీడియా ఉద్దేశంలో ప్రభుత్వం వేరు వైసీపీ వేరని. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నా, వైసీపీ వ్యతిరేక ఓట్లన్నా ఒకటే అన్న లాజిక్కును కూడా ఎల్లో మీడియా మరచిపోయింది. మొదటి నుండి కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లన్నీ ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్నాయట. వాటిని షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌కు మళ్ళించేస్తారట.

ఇక వివిధ సామాజిక వర్గాలకు చెందిన మధ్య తరగతి జనాల ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనట. అవన్నీ టీడీపీ కూటమికి వెళ్ళిపోతున్నాయ‌ట‌. కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన‌ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను మళ్ళీ కాంగ్రెస్‌కు మళ్ళించేంత సీన్ షర్మిలకు ఉందా అన్నదే ఆశ్చర్యంగా ఉంది. షర్మిలకంటు సొంత‌ ఇమేజీ లేదని అందరికీ తెలుసు. ఒకప్పుడు వైఎస్సార్ కూతురిగా తర్వాత జగన్ చెల్లెలుగానే అందరికీ తెలుసు. ఈ మధ్యనే సొంతంగా పార్టీ పెట్టుకుని తెలంగాణలో కాస్త హడావుడి చేసి సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని షర్మిల ప్రయత్నించి ఫెయిలయ్యారు.

ఇంతోటి షర్మిలను ఎల్లో మీడియా బూతద్దంలో చూపిస్తోంది. నిజానికి కాంగ్రెస్‌కు పడే ప్రతి ఓటు టీడీపీ కూటమికి పడే ఓటే అని అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను షర్మిల చీల్చుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య ఎంతగా చీలిపోతే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్ కదా? అన్న విషయాన్ని ఎల్లో మీడియా మరచిపోయింది. జగన్ ఓడిపోవాలి, జగన్‌ను ఓడించాలన్న కసితో ఎల్లో మీడియా లాజిక్కును కూడా మరచిపోతోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...