ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా అందులో బూతులు, తప్పులు, నానా అర్థాలు వెతకడం ఎల్లో మీడియాకే చెల్లింది. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులకు కూడా జగన్‌ని బాధ్యడిని చేస్తూ.. ఆయనపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.
అసలు విషయంలోకి వెళితే.. ఫిబ్రవరి 6వ తేదీన ఎల్లో మీడియాలో ఓ కథనం ప్రచురించారు. ఆ కథనంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి వైఎస్ జగన్ కారణమని, ప్రత్యేక హోదాను జగన్ వదిలేశాడని అర్థం వచ్చేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భజన చేసే ఓ పత్రిక రాసింది. ప్రత్యేక హోదా ఎండమావేనని జగన్ తేల్చేశాడని రాసింది.
తమ పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది అని జగన్ అన్నారు. అంతేకాదు.. రాష్ట్రాన్ని విడగొట్టడమే అన్యాయమంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఇంకా అన్యాయమని జగన్ అన్నారు. ఆ మాటలో ఎల్లో మీడియాకు ఏం తప్పు కనపడిందో తెలియదు కానీ.. హోదా రాకపోవడానికి జగనే కారణం అనే అర్థం వచ్చేలా కథనాన్ని వడ్డి వార్చేశారు.
ప్రత్యేక హోదాను మట్టిలో కలిపింది చంద్రబాబు కాదా… ఆయన తన ఐదేళ్ల పాలనలో ప్రత్యేక హోదా సాధించడానికి చేసిన కృషి ఏమిటో.. ప్రత్యేక హోదాను ఆయన ఎందుకు వదులుకున్నారో గుండె మీద చేయి వేసుకుని ఒక్కసారైనా చెప్పగలరా..? బాబు కాదు.. కనీసం ఆయనను వెనకేసుకొచ్చే ఈ ఎల్లో మీడియా అయినా దీనికి సమాధానం చెప్పగలదా?
ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్తే దానికి చంద్రబాబు అంగీకారంగా తలూపారు. పైగా, ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించుకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ విషయాలను గాలికి వదేలిసి.. జగన్ అన్న ఒక్క మాటను పట్టుకొని ఎల్లో మీడియా నానా రద్దాంతం చేస్తుండటం విశేషం.